నెట్టిల్లు


Sun,June 18, 2017 03:01 AM

మిధున


midhuna
Total views 1,13,795(జూన్ 10 నాటికి)Published on Jun 2, 2017
నటీనటులు : చిన్మయీ వర్మ, ఎం.శివ కుమార్ రావు, హారికా వర్మ, శివ మల్లిపాముల, ఫణి కుమార్, మైథిలి వర్మ
దర్శకత్వం: దిలీప్
ఒకరిని నిజంగా ప్రేమిస్తే.. ఆ ప్రేమ పది జన్మలైనా అలాగే ఉంటుంది. కానీ ఆ ప్రేమను కాదంటే మాత్రం తట్టుకోలేం. ప్రతీ మనిషికి ప్రేమను కోల్పోయే సందర్భం ఒకసారి వస్తుంది. అప్పుడు తట్టుకోవడం సాధ్యమే. కానీ రెండోసారి వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేడు. మిధున, శివ ప్రేమించుకుంటారు. మిధునకు శివ మీద ప్రేమ తగ్గిపోయినట్టనిపిస్తుంది. శివ, మిధునలు విడిపోతారు. మిధునకు చైతూ మీద ఇష్టం పెరుగుతుంది. ఇద్దరూ తరచూ కలుస్తుంటారు. మిధునకు చైతూకు కూడా గొడవలవుతుంటాయి. ఈ క్రమంలో శివ చైతూకు సహాయం చేస్తాడు. అది మిధున, చైతూలను కలుపుతుంది. శివ చైతూకు ఎందుకు సాయం చేస్తాడు? కథ చివర్లో చిన్న పాయింట్ కథను మలుపు తిప్పింది.

ఇది నా ప్రేమకథidi-na-premakatha
Total views53,239(జూన్ 10 నాటికి)Published on Jun 5, 2017
నటీనటులు : రాజు, శ్రావ్య, దుర్గాప్రసాద్, విజయలక్ష్మీ, పడమటి క్రిష్ణ, మణికంఠ, శ్రీలక్ష్మీ
దర్శకత్వం : మణికంఠ శనివారపు
నాని, అమూల్య ఇద్దరూ ప్రేమించుకుంటారు. అమూల్య అంటే నానికి చాలా ఇష్టం. ఎప్పటికైనా మా ప్రేమ గెలుస్తుందని నమ్ముతారు ఇద్దరూ. ఒకరోజు ఇద్దరూ సినిమాకెళ్దామనుకుంటారు. అమూల్యకు రావడం కుదరదు. ఇంట్లో ఫోన్ మరిచిపోయి బయటకు వెళ్లడం వల్ల నాని ఫోన్ చేస్తే కూడా ఎత్తదు. నానికి కోపం వస్తుంది. ఇద్దరూ గొడవ పెట్టేసుకుంటారు. విడిపోతారు. దీనికి తోడు స్వాతి అనే అమ్మాయి కూడా అమూల్యకు నానీని వదిలేయమని చెప్తుంది. కానీ స్వాతి ప్రేమ విషయాన్ని వారి పెద్దలకు చెప్పి ఒప్పిస్తాడు నాని. స్వాతి తన తప్పు తెలుసుకుంటుంది. ఈ లోపు అమూల్యకు పెళ్లి సంబంధం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో యూట్యూబ్‌లో చూడండి. మంచి లవ్‌స్టోరీ.

అంటరాని తనం


anturanithanam
Total views9,121(జూన్ 10 నాటికి)Published on Jun 2, 2017
నటీనటులు : హాసిని అన్వి, రెహానా, సుమన్‌రుద్రు, సంధ్యా జనక్, ఎన్.ఎస్.నాయక్, బాబు గోగినేని, స్నేహిత, రాజశేఖర్,గ్యాన్, జవహర్
దర్శకత్వం: శ్రీకాంత్ సలన, డా. ఆనంద్‌కుమార్ ఎస్లావత్
ఓ యువ మహిళా శాస్త్రవేత్త మామిడిలో కొత్తరకం వంగడాన్ని సృష్టిస్తుంది. అందుకు ఆమెను ప్రభుత్వం సన్మానిస్తుంది. ఆ సభలో ఆ వంగడం రహస్యాన్ని చెప్తుంది. అదే అంటుకట్టడం. చెప్తూ చెప్తూ తన గతంలోకి వెళ్లిపోతుంది. అగ్రవర్ణాల కుటుంబానికి చెందిన తన ఈడు అబ్బాయి తనతో ఆడుకోవడం ఆమె తల్లికి నచ్చదు. ఆ అమ్మాయి తల్లి అమ్మే చేపలు ఇష్టంగా తినే ఆ ఊరి దొరకు ఆమెను చేత్తో తాకడం నచ్చదు. ఆఖరికి తన కొడుకుతో ఆడుకున్నందుకు తనను కొట్టే సమయంలో కూడా చేత్తో తాకితే అంటు పడిపోతామని కర్రతో కొడతాడు. అప్పుడు ఆ అమ్మాయికి బాధకు బదులు కోపం వస్తుంది. ఎందుకీ అంటరానితనం? ఎక్కడిదీ అంటు? అంటూ తనను తానే ప్రశ్నించుకుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయే శాస్త్రవేత్త అవుతుంది.

రైతేరాజు


raithe-raju
Total views 4,904(జూన్ 10 నాటికి)Published on Jun 7, 2017
నటీనటులు : రాఘవ, శ్రీనివాస్, రషీద్, మహేష్, పవన్ సాయి, ప్రవీణ్, సందీప్, సాయిరాం, నవీన్, శ్రీకాంత్, పవన్, సాయికిరణ్, తిమోతి, శ్రవణ్ ఏపూరి
దర్శకత్వం: శ్రవణ్ విక్టరీ ఏపూరి
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతే ఆ రైతు పడే బాధ అంతా ఇంతా కాదు. కల్తీ విత్తనాలు వేసి మొలక బయటకు రాక మోసపోతాడు. కల్తీ పురుగుల మందు చల్లి పురుగులు చావక మోసపోతాడు. ఫలితం పంటచేతికి రాక అప్పుల పాలవుతాడు. పురుగులను చంపని కల్తీ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటాడు. నోట్లోకి ఐదువేళ్లు పోవాలంటే రైతుండాలి. రైతు సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే.. పంటలు పండాలి. పంటకు గిట్టుబాటు రావాలి. కల్తీ అనేది ఉండొద్దు. అంటూ రైతుకు బాసటగా నిలబడాల్సిన అవసరాన్ని చెప్తుంది.

989
Tags

More News

VIRAL NEWS