నెట్టిల్లు


Sun,May 14, 2017 03:08 AM

కొత్త కథ కావాలంటే.. ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన సమాజంలోనే ఎన్నో కథలున్నాయి. నిత్యం మనం ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజం ముందున్న సవాళ్లే కథలుగా మలిచి ఆలోచింపచేసేలా చిత్రీకరిస్తే.. ఆలోచనతో పాటు మార్పు కూడా సాధ్యమే. ఆ దిశగా ప్రయత్నించి కొన్ని షార్ట్‌ఫిలింస్ తీశారు ఈతరం యువ దర్శకులు. వాటిలో కొన్ని ఈవారం..

పిబరే ప్రేమరసం..


pibare-premarasam

Total views25,156(మే 6 నాటికి)Published on Apr 28, 2017
నటీనటులు : ఆర్.సన్నీ, నిరుపమ అరవ, అశ్విని శర్మ, క్రేజీ అభి, యాంకర్ లోబో
దర్శకత్వం: బాబు కిషోర్
కార్తీక్ పట్టు వదలని విక్రమార్కుడిలా ఎవరైనా ఒక అమ్మాయిని లవ్‌లో పడేయాలని ప్రయత్నిస్తుంటాడు. అతని ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రతీ ఒక్కరికీ ఓ లవర్ ఉంటుంది. కార్తీక్ కూడా తన ఫ్రెండ్స్ లవర్స్ కంటే అందమైన అమ్మాయిని ఇంప్రెస్ చేసి అందరిలో బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్ ఉన్న అబ్బాయి అనిపించుకోవాలనుకుంటాడు. ప్రపోజ్ చేసిన ప్రతీ అమ్మాయీ అతణ్ణి రిజెక్ట్ చేస్తుంది. మందు తాగుతూ.. తెల్లవార్లూ అమ్మాయిలని ఎలా పడేయాలని ఆలోచిస్తుంటాడు. కాలనీలో ఓ అమ్మాయితో ఛాలెంజ్ కూడా చేస్తాడు. ఛాలెంజ్ చేసిన మరుసటి రోజే కార్తీక్‌కి కవిత అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆఖరుకు ఏం జరిగింది? కార్తీక్, కవితల మధ్య ప్రేమ చిగురిస్తుందా? కార్తీక్‌కి గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతుందా? యూట్యూబ్‌లో చూడండి.

సీతమ్మ రాసిన రామాయణం


seetamma-rasina-ramayanam

Total views11,572(మే 6 నాటికి)Published on Apr 29, 2017
నటీనటులు : రాగ్ మిక్క్, సత్య సమీర, ఐష్ణవి
దర్శకత్వం : ప్రణతి స్వామి
సంజయ్, నిఖిత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చాలాకాలం ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఓ రోజు సంజయ్ తన ప్రేమను నిఖితకు చెప్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఓ పాప పుడుతుంది. ఆ తర్వాత నిఖితకు క్యాన్సర్ అని చెప్తారు డాక్టర్లు. సంజయ్ మాత్రం నిఖితకు ధైర్యం చెప్తూ.. త్వరలో ఇంటికెళ్లిపోతాం అని చెప్తాడు. కానీ నిఖిత డాక్టర్ మాటలు వింటుంది. నేను చనిపోతే.. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో.. అని చెప్తుంది. దానికి సంజయ్ ఒప్పుకోడు. నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా అంటాడు. చివరికి నిఖిత చనిపోతుంది. సంజయ్ చనిపోతాడా? వారి కూతురు వైష్ణవి పరిస్థితి ఏంటి? అనే విషయం యూట్యూబ్‌లో చూడండి. నటన పరంగా ఇద్దరూ బాగా చేశారు. కెమెరా పనితనం ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది. పెట్టిన టైటిల్‌కు, చివర్లో చెప్పిన కన్‌క్లూజన్‌కి సింక్ కాకపోయినా.. కథ బాగుంది.

మెన్ విల్ బి మెన్


men-will-be-men

Total views7,285(మే 6 నాటికి)Published on Apr 28, 2017
నటీనటులు : ఆకాశ్, రాకేష్, లాస్య, శివాని
దర్శకత్వం: జిల్లా నిఖిల్
అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఎలా ఉంటారనే కాన్సెప్ట్‌తో ఫన్నీగా ట్రై చేసిందే ఈ షార్ట్‌ఫిలిం. కాన్సెప్ట్ ఎంచుకోవడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ నిఖిల్.. దాన్ని ఇంట్రెస్టింగ్‌గా మలిచి, కామెడీ సీన్లు రాయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. యాక్టర్స్ కూడా ఫెయిలయ్యారు. నటన విషయంలో ఏదో చేశామంటే చేశాం.. అన్నట్టుగా ఉంది వారి నటన. ఇంకాస్త బాగా నటించి, చెప్పాలనుకున్న విషయాన్నే ప్లాన్ ప్రకారం సీన్లుగా రాసుకుంటే బాగుండేది. ఈ విషయంలో ఫెయిలయ్యారు. కెమెరా వర్క్ మాత్రమే బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. చివర్లో అమ్మాయిలు అబ్బాయిలకు ఇచ్చే పంచ్ పాతదే అయినా.. ఇంకా కొత్తగా ట్రై చేయొచ్చు.

కథ


kadha

Total views 6,282(మే 6 నాటికి)Published on Apr 28, 2017
నటీనటులు : ప్రణీత్, వాసంతి, ప్రశాంత్, మౌనిక, సాయి కిరణ్, భవ్య, అభి, సాయిలక్ష్మీ, అజయ్, ప్రణీత్, సాయి తేజశ్వి, రవీంద్ర కుమార్, రాజ్ కుమార్, అమర్‌నాథ్, మోహన్ కుమార్, కిషోర్
దర్శకత్వం: మణికంఠ. సిహెచ్
ఒకరిని ప్రేమిస్తే వాళ్లు తిరిగి ప్రేమించాలని ఏం లేదు. మన ప్రేమను తిరస్కరించినంత మాత్రాన ఆ అమ్మాయిని చంపడం, దాడులు చేయడం మన సంస్కారం కాదు. కని, పెంచి, మనిషి మనుగడకు కారణమైన మహిళను కాపాడుకోవడం మనందరి బాధ్యత. స్త్రీ మీద జరిగే దాడులను ఖండిద్దాం. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, మనుగడ లేదు. ఆమె కష్టాలను పంచుకుంటూ, ఆమె విజయంలో భాగమవుతూ, మన విజయంలో చోటు కల్పిస్తూ ముందుకు సాగుదాం అంటూ సందేశమిస్తున్న ఈ షార్ట్‌ఫిలిం ఆలోచింపజేసేలా ఉంది. మీరూ చూడండి.

921
Tags

More News

VIRAL NEWS