నెట్టిల్లు-షార్ట్ ఫిల్మ్స్ రివ్యూస్


Sun,August 13, 2017 02:49 AM

bahubali-3title=bahubali-3/

బాహుబలి -3

Total views
208,219
(ఆగస్టు 5 నాటికి)

Published on Aug 2, 2017
నటీనటులు : ఇందు కుసుమ, రఘ వర్మ, జో చివుకుల, దివ్య నందిని, ఆశిష్ జోస్
దర్శకత్వం: వాలీ సదా

ది కన్‌ఫ్యూజన్ కట్టప్ప స్వయంవరం పేరుతో భిన్నంగా తెరకెక్కిన షార్ట్‌ఫిలిం ఇది. పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచుతుంది. బానిసలకు కూడా వారసులవసరమని అనుకుంటాడు అమరేంద్ర బాహుబలి. ఒకవైపు కట్టప్ప మ్యారేజ్.. మరోవైపు అవంతిక, దేవసేన రివెంజ్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అవంతిక, దేవసేనల కక్షలకు చరమగీతం పాడడానికి శివగామిని పిలుస్తాడు కట్టప్ప. ముందు వాళ్ల రివెంజ్‌కి కారణమేంటో తెలుసుకోమంటాడు. ఆమె ఆ పనిలో ఉండగా వాళ్లిద్దరూ షష్ఠి పూర్తి వయసు దాటిన కట్టప్పకు అమ్మాయిని వెతికే పనిలో ఉంటారు? ఇంతకీ కట్టప్ప స్వయంవరం ఏమైంది? శివగామి వారి కక్షలకు కారణం కనుక్కుందా? అన్న విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ షార్ట్ ఫిలిమ్ చూడాల్సిందే!

tarunamtitle=tarunam/

తరుణం

Total views
20,178
(ఆగస్టు 5 నాటికి)

Published on Aug 4, 2017
నటీనటులు : శ్రీకాంత్ గుర్రం, శ్రీ సత్య
దర్శకత్వం : చందు శ్రీ పల్లె

ప్రేమించిన అమ్మాయిని కాదనుకొని కెరీర్ ముఖ్యమని యుఎస్ వెళతాడు ఒక అబ్బాయి. అక్కడికి వెళ్లిన నాలుగు సంవత్సరాలూ ఆమె ఆలోచనలతోనే గడుపుతాడు. అక్కడ ఉండలేక ఆమెను కలుసుకొనే తరుణం కోసం ఇండియా తిరిగొస్తాడు. వీళ్లిద్దరి ప్రేమకు కారణమైన కామన్ ఫ్రెండ్‌ని కలుస్తాడు. ఆమె ఆ అమ్మాయికి పెళ్లయితే ఏం చేస్తావని అడుగుతుంది. ఆ ఆలోచనే నన్ను కుదురుగా ఉండనీయక ఇక్కడిదాకా లాక్కొచ్చిందని చెబుతాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆమెను కలిసిన ప్రతిచోట గాలిస్తాడు. ఊరును జల్లెడ పడుతాడు. కానీ ఆమె జాడ ఉండదు. చివరకు కేరళలో ఉందని తెలుస్తుంది. అక్కడ నిజంగా ఆమె ఉందా? అప్పటికే ఆమె పెళ్లయిపోయిందా? ఏమో ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకే తెలుస్తుంది.


image

నీ చూపే

Total views
128,267
(ఆగస్టు 5 నాటికి)

Published on Aug 4, 2017
నటీనటులు : రుషి గోపీనాథ్, మౌనిక గోసుల, సుజాత
దర్శకత్వం: సంధ్యా రాణి పోచంబవి

ప్రేమను పొందడానికి దానిని ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన పని లేదు. కానీ ఆ ప్రేమను పొందడానికి మాత్రం కష్టపడాలనే కాన్సెప్ట్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు. ప్రేమ, పెళ్లి మీద ఎలాంటి ఓపీనియన్ లేని ఓ అబ్బాయిని తల్లి పెళ్లి చూపులకొప్పిస్తుంది. ఆ అమ్మాయిని కలిశాక, మాట కలిపాక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి ఎప్పటి నుంచో తనను ఫాలో అవుతుందని తెలిసి షాక్ అవుతాడు. ఇంతకీ ఆ అమ్మాయి, ఈ అబ్బాయిని ఎక్కడ చూసింది, ఎలా ఫాలో అయింది, తనను పెళ్లికి ఒప్పించడానికి ఆమె ఏం చేసిందనేది మాత్రం ఈ షార్ట్ ఫిలింలో చూడండి.

Is-This-Love

ఈజ్ దిస్ లవ్

Total views
54,312
(ఆగస్టు 5 నాటికి)

Published on Jul 28, 2017
దర్శకత్వం: సిద్ధార్థ వర్మ, విష్ణు ప్రియ

లవ్‌లో సెకండ్ ఛాన్స్ ఉండదు. మ్యారేజ్ విషయంలో ఉంటుంది. పెళ్లిచూపుల్లో అమ్మాయి నచ్చకపోతే వెనుకడుగు వేసి దారి మళ్లొచ్చు. ఒక అమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించి మోసపోయిన అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓ అమ్మాయిని కలుస్తాడు. తన ప్రేమ విషయం చెప్తాడు. ముందు ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరిస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్లకూడదు. అదే రావాలి. వచ్చి మాయ చేయాలని చెప్తుంది. ప్రేమ లేదని చెప్పిన ఆ అమ్మాయితోనే లవ్ యూ అని చెప్పించుకుంటాడు. ఎలాగో తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చూడాలి.

591
Tags

More News

VIRAL NEWS