నీకోసం ఎదురుచూస్తూ ఉంటా!


Sun,December 2, 2018 04:09 AM

love1
అంతకు ముందు ఈ నెంబర్‌ని వాళ్ల నాన్న వాడేవాడట. ఫిబ్రవరి 14న వాళ్ల నాన్న పుట్టినరోజంటా. అందుకని ఆ నెంబర్‌తో ఉన్న నాకు ఫొన్ చేసి విష్ చేశాడంట. అలా తనకు నా నెంబర్తె లిసింది.ఇప్పటివరకు మేము చూసుకోకుండానే లవ్ చేసుకున్నాం. ఒకరోజు ఇద్దరం కలుద్దామనుకున్నాం. నేను హైదరాబాద్ వెళ్లాను. తను కూడా వచ్చాడు. ఇద్దరం కలుసుకున్నాం.

ఫిబ్రవరి 14.. రాత్రి పదకొండున్నర అవుతుంది. సడెన్‌గా ఫోన్ వచ్చింది. ఈ టైమ్‌లో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తాను. కానీ ఎవరూ మాట్లాడడంలేదు. విసుగొచ్చి కాల్ కట్ చేద్దామనుకునేలోపే అటునుంచి హలో.. హ్యాపీ బర్త్‌డే నాన్నా అని ఒక వాయిస్ వినిపించింది. ఆ వెంటనే కాల్ కట్ అయింది. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎవరు? వాలెంటెన్స్‌డే రోజు నాకు ఫోన్ చేసి.. బర్త్‌డే విషెస్ చెప్పడం ఏంటన్న సందేహాలతో ఆ రాత్రంతా గడిచిపోయింది. ఉదయం లేవగానే ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ దివ్య గుడ్‌మార్నింగ్. ఎలా ఉన్నావ్? హైదరాబాద్‌లోనే ఉంటున్నావా? అని. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎవరబ్బా అని. నన్ను ఫేస్‌బుక్‌లో చూసి కాల్, మెసేజ్ చేస్తున్నాడేమో అనుకుందామంటే.. అతడితో నేను చాటింగ్ చేయలేదు. నెంబర్ ఇవ్వలేదు. నా నెంబర్ ఎలా తెలుసుకున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వరుసగా మెసేజ్‌లు పెడుతూనే ఉన్నాడు. నేను మాత్రం రిైప్లె ఇవ్వలేదు. అయినా రెగ్యులర్‌గా కాల్స్, మెసేజ్‌లు చేస్తూనే ఉన్నాడు.

ఓరోజు బాగా కోపమొచ్చి తిడుదామని కాల్ చేశాను. ఫోన్ ఎత్తాడు. ఎవరు నువ్వు? ఎందుకు కాల్స్, మెసేజ్‌లతో విసిగిస్తున్నావ్ అని ఫుల్‌గా తిట్టేశా. అతనేమో వెయిట్.. నేను బ్యాంక్‌లో ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి సింపుల్‌గా ఫోన్ పెట్టేశాడు. వీడేంటి ఇలా అంటున్నాడు అనుకున్న. అప్పుడు నాకు పరీక్షల సమయం. ఫోన్ పక్కన పడేసి చదువు మీద ధ్యాస పెట్టా. మళ్లీ ఓ మెసేజ్ వచ్చింది.నీ వాయిస్ బాగుంది. నీ మాటలు ఇంకా బాగున్నాయ్ అని. అసలు నువ్వు ఎవరు? అయినా నా నెంబర్ ఎలా వచ్చింది. నన్ను డిస్ట్రబ్ చెయ్యకు. నేను చదువుకోవాలి. నాకు పరీక్షలు ఉన్నాయి అని చెప్పేశా. నేను వాడుతున్న నెంబర్ కూడా రీసెంట్‌గా తీసుకున్నాను. ఎవరికీ నెంబర్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ ఫోన్ చేసే అబ్బాయికి నా నెంబర్ ఎలా తెలిసింది? అని ఎంత ఆలోచించినా నా బుర్రకు సమాధానం దొరకలేదు. అది తెలుసుకోవాలనే ఓరోజు ఆ అబ్బాయినే అడిగా.. నా నెంబర్ ఎలా తెలుసు నీకు అని. దానికి ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? అంతకు ముందు ఈ నెంబర్‌ని వాళ్ల నాన్న వాడేవాడట. ఫిబ్రవరి 14న వాళ్ల నాన్న పుట్టినరోజంటా. అందుకని ఆ నెంబర్‌తో ఉన్న నాకు ఫొన్ చేసి విష్ చేశాడంట. అలా తనకు నా నెంబర్ తెలిసింది. అతని మెసేజ్‌లకు నేను పెద్దగా రిైప్లె ఇవ్వకపోయినా తను మాత్రం ప్రతీరోజూ మెసేజ్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత నేను కూడా రిైప్లె ఇవ్వడం మొదలుపెట్టా. అలా వారం రోజులకి ఇద్దరం మంచి స్నేహితులయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. ఇదంతా వద్దు మనిద్దరికీ సెట్ అవ్వదు.

మా ఫ్యామిలీ పద్ధతులు వేరుగా ఉంటాయి అని చెప్పాను. ఆ అబ్బాయి మాత్రం ఇవన్నీ కాదు.. నేను నిన్ను ప్రేమిస్తున్నానంతే. మనం పరిచయం అయి కొద్దిరోజులే అయినా నీ మీద నా ప్రేమ శాశ్వతం అంతే అన్నాడు. నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. అతనితో నేను మామూలుగా ఉండేదాన్ని. రోజూ కాల్ చేసి మాట్లాడేవాడు. నేను కూడా మాట్లాడేదాన్ని. సడెన్‌గా వరుసగా నాలుగైదు రోజులు కాల్ రాలేదు. మెసేజ్ కూడా రాలేదు. నాకు ఏదోలా అనిపించింది. ఐదో రోజున కాల్ వచ్చింది. ఎక్కడికిపోయావ్‌రా అసలు? రోజూ నీ గుడ్‌మార్నింగ్‌తో నాకు రోజు మొదలై, గుడ్‌నైట్‌తో ముగిసేది. నువ్వు నాతో మూడు నెలల నుంచి లవ్ యూ లవ్ యూ అంటూ ఉంటే అర్థం కాలేదు. నాలుగు రోజుల నుంచి నీ నుంచి కాల్ గానీ, మెసేజ్ కానీ రాకపోతే అర్థమయింది.. నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఐ లవ్ యూ ఫరెవర్ అని చెప్పేశా. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. పరీక్షలు రాసేశాను. ఇప్పటివరకు మేము చూసుకోకుండానే లవ్ చేసుకున్నాం. ఒకరోజు ఇద్దరం కలుద్దామనుకున్నాం. నేను హైదరాబాద్ వెళ్లాను. తను కూడా వచ్చాడు. ఇద్దరం కలుసుకున్నాం. తను ఉద్యోగం చేస్తాడు. నేను కూడా ఉద్యోగంలో చేరాను. ఇద్దరం చాలా సంతోషంగా గడిపాం. నేను చాలా అల్లరిపిల్లని. వాడు నన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకునేవాడు. ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండాలనుకున్నాం. పండుగకి తను వాళ్లింటికి వెళ్లాడు. నేను కూడా మా ఇంటికి వచ్చేశాను. అప్పటివరకు బాగానే ఉన్నాం. మళ్లీ ఏమైందో ఏమో ఒకరోజు ఫోన్ చేసి నన్ను మర్చిపో నీకు నాకు సెట్ కాదు. నువ్వుంతా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటావు. నువ్వు నాకు వద్దు ఇక గుడ్ బై అని అనేశాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాడికి ఇద్దరు చెల్లెళ్లు. వాళ్ల అమ్మకు నేనంటే ఇష్టం లేదట. వాడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నేను లేనిదే జీవితం లేదనుకున్నాడు. మేం కలిసిన ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా నన్ను ఏం అనలేదు. నన్ను మా అమ్మలా చూసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు.
love2
అలాంటిది నన్ను ఎందుకు వద్దన్నాడో అర్థం కాలేదు. పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను డిగ్రీ ఫెయిల్ అయ్యాను. ఒక సంవత్సరం గ్యాపు వచ్చింది. అన్నీ వాడి జ్ఞాపకాలే. అసలు వాడు లేకుండా నేను ఎలా ఉంటున్నాననే సందేహం వచ్చేది. ఆ సంవత్సరమంతా ఎవరితో మాట్లాడలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లాను. తనని ఎంత ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. వాడు నన్ను ఎప్పుడు బాగా చదువుకో అని అంటూ ఉండేవాడు. ఆ మాటలు పదే పదే గుర్తొచ్చి.. మళ్లీ బాగా చదివి డిగ్రీ పూర్తి చేశాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పటికీ నాకు ఒక్కటి అర్థం కావడంలేదు. కారణం లేకుండా నన్ను ఎందుకు వద్దనుకున్నాడో. నాకు దూరమయ్యాడు. కానీ, నా మనసుకు మాత్రం దూరంగా వెళ్లలేకపోతున్నాడు. నా జీవితాంతం నీ కోసం, నీ పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉంటా నానీ..

ఐ లవ్యూ ఫరెవర్.
నిన్ను ప్రేమించే నీ ది

690
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles