తుడుం ఆట!

Sun,March 19, 2017 01:20 AM

తెలంగాణ పల్లెల్లోని ఆటల్లో పాటలు కలగలిసినట్లే ప్రకృతి మిళితమైన ఆటలు కూడా చాలానే ఉన్నాయి. చెట్టు చేమలతో చెలిమి ప్రకృతిలోని సకల వర్ణాల మేళవింపు కొన్ని ఆటల్లో కనిపిస్తాయి. బాల్యంలో బాల బాలికలు ఆటల్లో మునిగితే అన్న పానాదులు కూడా మర్చిపోయేవారు. ఇది ఎనకటి పరిస్థితుల్లో ఉండేది. కానీ నాటి ఆటల జాడలే లేవు. ఆటల వల్ల శారీరక.. మానసిక వికాసం.. బుద్ధి పరిణతి.. వినోదం కలుగుతుందన్న సోయే మర్చినం. నేటి కంప్యూటర్ యుగంలో పిల్లలకు వికాసం.. ఆనందం కలిగించే ఆటలు నేర్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటి ఆటల్లో తుడుం ఆటకూడా ఒకటి. నేటితరం బాలలకు తెలియని తుడుం ఆట గురించి ఈ వారం తెలుసుకుందాం.

ఎవరెవరు ఆడొచ్చు?:బాలబాలికలు ఈ ఆట ఆడొచ్చు. అంటే సుమారు 16 సంవత్సరాల వయసు లోపువారు ఆటడం సహజం.

ఎంతమంది ఆడొచ్చు?: ఎంతమందైనా ఆడొచ్చు. కాకపోతే కనీసం ఐదుగురు లేదా ఆరు నుంచి ఎనిమిది లేదా పది మందిదాకా ఆడితే బాగుంటుంది.


ఏ సందర్భంలో ఆడేవారు?: పశువులు.. గొర్రెలు.. మేకలు తోలుకుని పచ్చికబీళ్లు.. కంచెల్లోకి వెళ్లినప్పుడు అవి మేతమేసి నీళ్లుతాగి విశ్రమించే వేళల్లో లేదా సెలవురోజుల్లో ఊర్లళ్ల పిల్లలు తుడుం ఆట ఆడేవాళ్లు.

Gameఆడే విధానం : దొంగ అయిన వారికి గుంపులోని వాళ్లలో ఎవరో ఒకరు ఏదైనా ఒక ఆకు పేరు చెప్పి దాన్ని తెచ్చి చూపమంటారు. దొంగ ఆకు తేవడానికి వెళ్లగానే మిగిలిన వాళ్లంతా పరిసరాలలోనే రహస్య చోట్లల్ల దాక్కుంటారు. ఆకు కోసం వెళ్లిన దొంగ ఆకు తెంపుకుని పిడికిలిలో దాస్కుని ముందే వేర్వేరు ప్రాంతాల్లో దాక్కున్నవాళ్లను వెతకాలి. వెతికే సందర్భంలో ఎవరైనా కనిపించగానే తుడుం అనాలి. అంటే ఔటయినట్లని అర్థం. ఉదాహరణకు తన ఆట గుంపులోని సాయిచరణ్ కనిపిస్తే సాయిచరణ్ తుడుం అనాలి. అప్పుడు సాయిచరణ్ దొంగ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ముందుగా ఎవరు కనిపిస్తే అతనే దొంగ. అలా తుడుం అనగానే దాస్కున్న వాళ్లంతా నవ్వుతూ బిలబిలా ఒక చోటకు చేరుతారు. మళ్లీ ఇప్పుడు సాయి చరణ్‌కు మరో ఆకు పేరు చెప్పి అందరూ గప్పున మాయమవుతారు. ఇలా తుడుం ఆట అలసిపోయేదాకా లేదంటే సమయమున్నంత సేపూ కొనసాగుతుంది.

ప్రకృతి ఆట : ఆట ప్రకృతి ఒడిలో ఆడే సయ్యాటగా చెప్పొచ్చు. తెలంగాణలో ఎక్కువ బాలబాలికలు కలిసి ఆడేది ఈ ఆటే. ముఖ్యంగా మగపిల్లలు తుడుం ఆట బాగా ఆడేవాళ్లు. ఈ ఆట ఆడే సమయంలో చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే మొక్కలు.. చెట్లు ఆకులతో పరిచయం ఏర్పడి వాటి పేర్లు జీవితాంతం గుర్తుంటాయి. బాగా దూరం వెళితేగానీ దొరకని ఆకుల పేర్లు కూడా చెప్పిన చెట్టు ఆకు తెచ్చాడో లేదా అని గమనించేవాళ్లు. ఓ ముప్ఫయి నలభై యేండ్ల క్రితం తుడుం ఆట బాగా ఆడేవాళ్లు.

ప్రయోజనం : తుడుం ఆట ఆడటం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కలిసి పనిచేయడం.. సాధక బాధకాలు అర్థం చేసుకోవడం తెలిసేది. అన్నింటికన్నా మానసిక ధారుఢ్యం ప్రకృతితో అనుబంధం కలుగుతుంది. చెట్లు ఆకుల పరిచయాలు కలుగుతాయి. సమవయస్కులందరూ ఒకచోట చేరి ఆడడం వల్ల అంతా ఒక్కటే అన్న భావన కలుగుతుంది. తుడుం ఆటవల్ల బుద్ధి వికాసం.. ఊహాశక్తి పెరుగుతాయి.

మళ్లీ ఆడాలి : ఒకప్పుడు దేదీప్యమానంగా ఆడుకున్న తెలంగాణ ఆటల్లో ముఖ్యమైంది తుడుం. వలసాంధ్ర పాలనలో మన ఆటలు.. పాటలు.. సంస్కృతి మనకు కాకుండా పోయాయి. నేడు స్వరాష్ట్రంలో మళ్లీ వెతికి నేటితరం పిల్లలకు ఎరుక చేయాలి. పాఠశాలల్లో గేమ్స్ పీరియడ్‌లో వెనకటి ఆటలను పరిచయం చేయాలి. ప్రభుత్వం కూడా గ్రామీణ ఆటలకు ప్రాధాన్యం కల్పించాలి. కంప్యూటర్ల ముందు కూసొని ఆడే ఆటలకు కొంతవరకైనా స్వస్తి పలకాలి. అటు తల్లిదండ్రులు.. ఇటు టీచర్లు తుడుం ఆట ఆడేలా బాలలను ప్రోత్సహించాలి.

తోడు-పండు:
తుడుం ఆట మొదలుపెట్టాలంటే ఆటలో పాల్గొనే పిల్లలంతా గుండ్రంగా నిలబడి తోడుపండు లేదా తోడు పంట వేసుకుని దొబ ఎవరో నిర్ణయిస్తారు. పాల్గొనేవారంతా వృత్తంలా నిలబడి ఒకరి చేతులు ఒకరు కలిపి పట్టుకుని ఒకేసారి తమ చేతుల్ని వదిలిపెట్టి ఎవరి అరచేతుల్ని వాళ్లు బోర్లాకానీ వెల్లెకలాగానీ ఇష్టం వచ్చిన తీరుగా చప్పట్లు చరిచి చేతులను అలాగే ఉంచాలి. అప్పుడు గుంపులోని వాళ్లందరూ బోర్లా.. వెల్లెకలా చేతులు ఉంటాయి. తక్కువ సంఖ్యలో ఒకే రీతిలో ఉన్నవాళ్లు పండు అవుతారు. పండు అయినవారు గుంపులోంచి తప్పుకుని పక్కన నిలబడాలి. మిగిలినవాళ్లు మళ్లీ చప్పట్లు చరచాలి. పండు అయినవాళ్లు పోగా చివరకు మిగిలిన వ్యక్తి దొంగ అయినట్లు లెక్క.

ఇలా ఈత కొడుదాం..


వేసవి వచ్చేసింది. ఈ సమయంలో ఈతకొట్టాలని పిల్లలంతా సరదా పడుతుంటారు. స్విమ్మింగ్‌ఫూల్‌కి తీసుకెళ్లకుండానే.. పిల్లలకు ఈత కొట్టిన అనుభూతిని కలిగించే గేమ్స్ కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని..

స్విమ్మింగ్ రేస్ 3డీ


ఫ్రీ ైస్టెల్, బట్టర్ ైఫ్లె, బ్రెస్ట్ స్ట్రోక్‌లాంటి పలు రకాల ఈతల గురించి పిల్లలకు అవగాహన పెరుగుతుంది. స్విమ్ బటన్‌ను నొక్కి.. స్విమ్మింగ్ ఫూల్‌లో నాణేలను సేకరించుకుంటూ పోవడమే. ఎంత ఎక్కువ సమయం ఈ ఆట ఆడగలిగితే.. అన్ని ఎక్కువ కాయిన్లను గెలుచుకోవచ్చు.

స్విమ్మింగ్ ఫూల్ రేస్ 2017


ఆయా దేశాలకు చెందిన స్మిమ్మింగ్ క్రీడాకారులను ఎంపిక చేసుకొని ఈ ఆటను ఆడాల్సి ఉంటుంది. 100 మీటర్ల నుంచి 400 మీటర్ల రిలే రేసుల్లో పాల్గొనాలి. ఒలింపిక్స్‌లాంటి వేదికల్లో నిర్వహించే బ్రెస్ట్ స్రోక్, ఫ్రంట్ క్రాల్, బ్యాక్ స్ట్రోక్, బట్టర్ ైఫ్లెతోపాటు ఫ్రీ ైస్టెల్‌లాంటి పలు రకాల్లో వేగంగా ఈత కొడుతూ.. చాంపియన్ కావచ్చు.

ఫ్లిప్ డైవింగ్..


ఆండ్రాయిడ్ గేమ్స్‌లో వచ్చిన మొట్టమొదటి డైవింగ్ గేమ్ ఇది. ఫ్రంట్ ఫ్లిప్స్, బ్యాక్‌ఫ్లిప్స్‌లాంటి టెక్నిక్‌లను నేర్చుకోవచ్చు. బాడీ బిల్డర్‌గా.. బిజినెస్ మ్యాన్‌గా.. పెంగ్విన్‌గా మారి చెట్లు, కొండలు, వంతెనలు, పడవల మీద నుంచి నీటిలోకి దూకడం ఆనందాన్నిస్తుంది. ఇందులోని 50 స్టేజ్‌లు పిల్లలకు ఆసక్తి కలిగిస్తాయి.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655

1258
Tags

More News

మరిన్ని వార్తలు...