జానపదాన్ని జనపదం చేసిన కాసర్ల శ్యాం


Sun,October 29, 2017 12:25 AM

ఆయన పుట్టింది జానపదుల ఖిల్లా వరంగల్ జిల్లా. పల్లెపాటలకు పరుగులు నేర్పిన వరంగల్ శంకర్, సారంగపాణిలకు ఏకలవ్యశిష్యుడు. తండ్రి కూడా కళాకారుడు కావడంతో కళ ఆయనతో పాటే పుట్టి పెరిగింది. ఓరుగల్లు గడ్డమీద గజ్జెకట్టి ఆడిపాడిన అనుభవం ఆయనను గాయకుడిగా, రచయితగా తీర్చిదిద్దింది. ఆ మట్టిపరిమళాన్ని ఒడిసిపట్టుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.
చంటిగాడుతో మొదలైన ఆయన సినిమా పాటల ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎన్నో విజయవంతమైన పాటలతో తెలుగువెండితెర మీదా ప్రత్యేకతను చాటుకుంటున్న పాటల రచయిత కాసర్ల శ్యాం.
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి

2009లో వచ్చిన మహాత్మ సినిమాలో సూపర్‌హిట్ సాంగ్. ఈ పాటను రాసింది కాసర్ల శ్యాం. ఫోక్‌బాణీలో సాగే ఈ పాట నేటికీ మంచి ఊపున్న పాటగా రికార్డు నెలకొల్పింది. ఈ పాట శ్యాంకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. విశేషమేంటంటే ఈ పాటను సినిమాలో పాడింది కూడా కాసర్ల శ్యామే.ఏయ్ రాజారాజా రాజా ది గ్రేటురానువ్ తళతళ 2వేల నోటురా అంటూ ఇటీవల వచ్చిన రాజా దిగ్రేట్ చిత్రం కోసం శ్యాం టైటిల్‌సాంగ్ రాయడం విశేషం. కాకతీయుల రాజధాని అయిన వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడలో కాసర్ల శ్యాం జన్మించారు. తల్లి మాధవి, తండ్రి మధుసూదన్‌రావు. తండ్రి రంగస్థల, టీవీ, సినీనటుడు. దీంతో శ్యామ్‌కు బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆయన లాగే నటుడు కావాలని తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగంలో ఎంఫిల్ చదివాడు. చిన్నతనం నుండే అనేక వేదికలపై జానపదనృత్యాలు చేయడంతో పాటు, పాటలూ పాడాడు. వరంగల్ శంకర్, సారంగపాణిల బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా ఎదిగి వచ్చాడు. కాసర్ల శ్యాం 2003లో వచ్చిన చంటిగాడు అనే చిత్రం ద్వారా తొలిసారి సినిమా పాటల రచయితగా మారారు.
kasara-syam

కోకోకోకొక్కోరోక్కో కొక్కోరోక్కో
ఇది నిప్పుకోడి పెట్టరో దీనికి ఇప్పసారా పట్టరో
ఇది కన్నెకోడి పెట్టరో దీని కన్నుగీటి పట్టరో

వయసులో ఉన్న అమ్మాయిని నిప్పుకోడితో పోలు స్తూ శ్యాం రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. సిగ్గులొలికే సీతాలు నా చెంతకు చేరవమ్మా
నీ చిత్రమైనా అందాలు నా సొంతం చేయవే గుమ్మా అనే మరోపాట కూడా ఆయన రాసిందే. తొలిసారే రెండు పాటలు రాసే అవకాశం రావడం, రెండూ కూడా ప్రేక్షకులను అలరించడంతో శ్యాం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

కుక్కురు కురు కుక్కురు కిక్
యా తీస్మార్ ఖాన్ బరిలో షేర్‌ఖాన్ తీనుమారేస్తే
అంటూ కిక్-2 కోసం శ్యాం మాస్‌గీతాన్ని రాశారు.సినిమాలకు రాకముందు కాసర్లశ్యాం వేలాది జానపద గీతాలు రాసి పాడాడు. వాటిని ఆల్బమ్స్‌గా కూడా తీసుకువచ్చాడు. సుమారు 50పైగా ఆల్బ్‌మ్స్‌కు ఆయర పాటలు రాశారు. కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్‌గుందిరో అనే పాట శ్యాం రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు వంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ ఆయన చేసినవే.
రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే

ఒంటరి వాడైన ఓ యువకుడు తనను తను రాజుగా చెప్పుకుంటూ తనకు ఫ్యాన్స్‌తో పాటు ఏ వాడలోనైనా తనకు చుట్టాలుంటారని చెప్పుకుంటాడు తుంటరి చిత్రంలో.శ్యాం సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వెళ్లేవాడు. అలా పాటలు పాడడం, రాయడంలో అనుభవాన్ని సంపాదించాడు.
టిక్కుటిక్కంటూ చేతీకి గడిపెట్టీ టీకుటాకునా కండ్లకి ఐనా పెట్టి
కోర మీసాన్ని గిర్రుమంటూ తిప్పరో ఎంకటేశో ఎంకటేశో

అంటూ మందులోడా ఓరి మాయలోడా అనే జానపద బాణీలో ఆయన రాసిన ఈ పాట బాబు బంగారం చిత్రంలో హస్య సన్నివేశానికి అతికినట్లు సరిపోయింది.ప్రేమ కథా చిత్రమ్ సినిమాలో కొత్తగున్న హాయే నువ్వా,మత్తుగున్నా మాయే నువ్వా అంటూ రొమాంటిక్ సాంగ్ రాసిన కాసర్ల తన కలానికి రెండువైపులా పదునుందని నిరూపించున్నాడు. ఈ పాట కాసర్ల శ్యాంకు అత్యంత ఇష్టమైన పాట.
1984 నుండి గాయకుడిగా, రచయితగా కాసర్ల శ్యాం ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాలకు 150 వరకు పాటలు రాశారు. పాటలు పాడడం, రాయడంతో పాటు శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు.

లై చిత్రంలో అదర నా గుండెలదరా నిదుర కంటికి రాదు అంటూనే బొమ్మోలే ఉన్నదిరా పోరి బొం బొంబాట్ గుందిరా నారి,లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్పా బుగ్గలది ఫ్యారి అంటూ తనదైన జానపద బాణీని జోడించి లై చిత్రంలో ఆయన చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంటుంది.

2014లో వచ్చిన రౌడీ చిత్రం కాసర్ల శ్యాం కెరీర్‌లో మరిచిపోలేని చిత్రం. ఎందుకంటే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆయన రాసినవే.
అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే
అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే

తమను ఎల్లవేళలా కాపాడుతూ ఉండే నాయకున్ని కీర్తిస్తూ జనం పాడుకునే సందర్భంలో వచ్చేపాట ఇది. అలాగే
నీ మీద ఒట్టు-నా ప్రేమమీద ఒట్టు
నా కోసం నిను గన్న ఈ సీమ మీద ఒట్టు

తను ప్రేమించిన యువతికి తన మీదా నమ్మకం కలిగించడానికి ప్రేమికుడు ఒట్టువేసి తన విశ్వాసాన్ని నిరూపించుకునే సందర్భానికి తగినట్లు శ్యాం అత్యంత అద్భుతంగా రాసిన పాట ఇది.
Rowdy

1215
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles