క్యాబేజీ కాంబినేషన్స్


Sun,November 12, 2017 01:48 AM

క్యాబేజీ అంటే కొందరికి ఇష్టముండదు..ఇంకొందరైతే ఆ కాయగూర వాసనకే ఆమడ దూరం పారిపోతారు.. కానీ మంచిగా వండితే దీనికి మించిన ప్రోటీన్లు ఎందులోనూ దొరుకవు.. కేవలం కూరగానే చేయడం అలవాటయిన మీకు.. ఈ రోజు వీటితో క్రేజీ కాంబినేషన్స్‌ని తీసుకొచ్చాం.. విందు ఆరగించడానికి ఇక సిద్ధమైపోండి..క్యాబేజీ ఇడ్లీ

కావాల్సినవి :బియ్యం : 2 కప్పులు, మినుపపప్పు : ఒక కప్పు ,క్యాబేజీ తురుము : 250గ్రా.,

కొబ్బరి తురుము : ఒక కప్పు, చింతపండు రసం : అర కప్పు, కారం : 2 టీ స్పూన్స్, పసుపు : అర టీ స్పూన్, ఇంగువ : అర టీ స్పూన్, నూనె : 2 టీ స్పూన్స్, ఉప్పు : తగినంత.

తయారీ :బియ్యం, మినుపపప్పుని వేరువేరుగా కడిగి 5 నుంచి 6గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లను వంపేసి ఆ బియ్యంలో, మినుపపప్పు, కొబ్బరితురుము, కారం, పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా మిక్సీ పట్టాక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఇంగువ, క్యాబేజీ తురుము, ఉప్పు వేసి ఐదునిమిషాల పాటు కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌లని తీసుకొని కొద్ది, కొద్దిగా నూనె రాయాలి. కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని వాటిల్లో వేయాలి. వీటిని ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి 20 నిమిషాలపాటు సన్నని మంటమీద ఉడికించాలి. ఆ తర్వాత పది నిమిషాల వరకు మూత తియ్యకూడదు. మూత తీశాక చిన్న స్పూన్‌తో ఇడ్లీలను తీయాలి. ఈ క్యాబేజీ ఇడ్లీలను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో గానీ లాగించేయొచ్చు.
Idly

క్యాబేజీ వడ

కావాల్సినవి : క్యాబేజీ తురుము : 1 1/2 కప్పులు ,ఉల్లిపాయముక్కలు : అర కప్పు ,శనగపిండి : 1 1/2 కప్పులు ,అల్లం పేస్ట్ : ఒక టీ స్పూన్ ,ఎండు మిరపకాయలు : 3,కరివేపాకు : ఒక రెమ్మ ,నూనె, ఉప్పు : తగినంత.

తయారీ :ఒక గిన్నెలో ఉల్లిపాయముక్కలు, అల్లంపేస్ట్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, క్యాబేజీ తురుము, ఉప్పు చివరగా శనగపిండి వేయాలి. కొన్ని నీళ్లు పోసి నీళ్ళలా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న, చిన్న ఉండలుగా చేసి గుండ్రంగా చేతితో ఒత్తి నూనెలో వేయాలి. ఇలా మిశ్రమం అంతా పూర్తయ్యేదాకా చేయాలి. ఈ వడలను బంగారు రంగు వచ్చే వరకూ వేయించి తీయాలి. వేడి.. వేడి క్యాబేజీ వడలు రెడీ!
cabbage-vada

క్యాబేజీ దోశ

కావాల్సినవి :బియ్యం పిండి : ఒక కప్పు, క్యాబేజీ తురుము : ఒక కప్పు, శనగపప్పు : 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు : ఒక టేబుల్ స్పూన్, కారం : ఒక టేబుల్ స్పూన్, చింతపండు: కొంచెం, పసుపు : అర టీ స్పూన్, ఉప్పు, నూనె : తగినంత.

తయారీ :బియ్యం, శనగపప్పు, కందిపప్పులను కలిపి కడిగి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే నీళ్లు వంపేయాలి. చింతపండును వేడినీళ్లలో ఓ 10 నిమిషాలు నానబెట్టాలి. దానివల్ల చింతపండు కొద్దిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు చింతపండు, కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా బియ్యం వేసి గ్రైండ్ చేయాలి. ఇది పేస్ట్‌లా అయ్యాక మిగతా బియ్యాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే మొత్తం పేస్ట్‌లా అవ్వదు. కాబట్టి ముందుగా కొన్ని బియ్యం పోసి గ్రైండ్ చేయాలన్నమాట. దీన్ని ఒక గిన్నెలో వేసి అందులో క్యాబేజీ తురుమును వేసి కలుపుకోవాలి. ఓ పది నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత దోశలు పోయడం ప్రారంభించాలి. ఈ దోశలకు కొబ్బరి చట్నీ లేదా సాంబార్ కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది.
dosa

1386
Tags

More News

VIRAL NEWS