కొత్త పాట


Sun,December 2, 2018 12:55 AM

vijay-devarkonda

నీ వెనకాలే నడిచి

సినిమా : ప్రైవేట్ ఆల్బమ్
తారాగణం : విజయ్ దేవరకొండ, మలోబిక
దర్శకత్వం : భానుశ్రీ తేజ
సంగీతం : సౌరభ్ - దుర్గేష్
లిరిక్స్ : అనంత శ్రీరామ్
గానం : చిన్మయి

ఏమిటి తొందరా
ఎప్పుడూ లేదుగా
ఇప్పుడే ఎందుకో ఏమో

దేనికి గాబరా యదలో ఇంతగా
ఏమి కానున్నదో ఏమో

ఓ ఆశలే ఆపుకోలేక
మాటలే దాచుకోలేక
నేడిలా వేచి చూస్తున్నాగా

ఓ గీతలే గీసుకోలేక
గీసిన దాటి నీదాక
చేరగానే తపిస్తూ ఉన్నాగా

నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరిచి
నీ జతగా బతకాలి ఎలాగైనా

ఆ రోజు దారిలోన
చేసిన ఓ చిన్ని సాయం
ఆ చోటే గుండెలోన
రేపినదో తీపి గాయం

ప్రాణం నీ చిలిపి కనులలో
మేఘం అయినదిప్పుడు
మౌనం ఓ అడుగు పడనివ్వదు

ఆకలా అది ఎలాగుందో
దాహమా అది ఎటేపుందో
స్నేహమా నిన్ను స్మరిస్తూ నేనుంటే

హో లోకమే ఇక పరాయయిందో
కాలమే ఇక పరాకైందో
నేస్తమా నీ స్వరాన్ని వింటుంటే
హో నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా

ఏమిటి సంబరం
ఎప్పుడూ లేదుగా
ఇప్పుడే ఎందుకో ఏమో

గుండెలో సాగరం
అలలై పొంగేనా
ఆశ తీరిందనా ఏమో

నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా

టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది వీక్

1 మాటే వినదుగ - టాక్సీవాలా
2 అనగనగా - అరవింద సమేత
3 మై వరల్డ్ ఈజ్ ైఫ్లెయింగ్ - హలో గురూ ప్రేమ కోసమే
4 రెడ్డి ఇక్కడ సూడు - అరవింద సమేత
5 డాన్ బాస్కో - అమర్ అక్బర్ ఆంటోని
6 పెనివిటి - అరవింద సమేత
7 బుల్లిగువ్వ - 2.0
8 నిన్ను రోడ్డు మీద - సవ్యసాచి
9 యేంటి యేంటి - గీత గోవిందం
10 ఉండిపోరాదే - హుషారు

116
Tags

More News

VIRAL NEWS