కొత్త పాట


Sun,September 9, 2018 01:15 AM

song

వారు వీరు


సినిమా : దేవదాస్
తారాగణం : అక్కినేని నాగార్జున,
నాని, రష్మిక
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
సంగీతం : మణిశర్మ
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామాశాస్త్రి
గానం : అనురాగ్ కులకర్ణి,అంజనా సౌమ్య

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దామనుకున్నా

ఏ మాట పైకి రాక
మనసేమో ఊరుకోక
అయినా ఈ నాటిదాక
అస్సలు అలవాటు లేక
ఏదేదో అయిపోతున్నా

పడుచందం పక్కనుంటే
పదిపోదా పురుషజన్మ
అలా పడిపోకపోతే
ఏం లోటో ఏమో కర్మ

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయాలనుకున్నా

జాలైనా కలుగలేదా కాస్తయినా
కరగరాదా నీముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా
వీలైతే తడుముతున్నా
పోనీలే ఊరుకున్నా

సైగలెన్నో చేసినా
తెలియలేదే సూచన
ఇంతకీ నీ యాతన
ఎందుకంటే తెలుసునా
ఇది అనేది అంతు తెలుసునా

పడుచందం పక్కనే ఉంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోకపోతే
ఏం లోటో ఏమో కర్మ

ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పు రవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్భుతంలో
ఉయ్యాలూపినావు హాయి కైపులో

అష్ట దిక్కుల
ఇలా వలేసి ఉంచినావే

వచ్చి వాలావే
వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా

ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్లకే నన్నింత హింసలో

తమాషా తగాదా తెగేదారి
చూపవేమి బాలా

పడుచందం పక్కన ఉంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోకపోతే
ఏం లోటో ఏమో కర్మ

టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది వీక్

1 ఎగిరెనే మనసు - నర్తనశాల
2 పెళ్లిడు వచ్చిందని - కో కో కోయిల
3 పిల్లా రా - ఆర్‌ఎక్స్ 100
4 ఇంకేం ఇంకేం కావాలి - గీత గోవిందం
5 వారు వీరు - దేవదాస్
6 అను బేబీ - శైలజా రెడ్డి అల్లుడు
7 ఏంటీ ఏంటీ - గీత గోవిందం
8 ఎగిరే ఎగిరే - శైలజా రెడ్డి అల్లుడు
9 మొదలవుదాం - శ్రీనివాస కళ్యాణం
అనగనగా - గూఢాచారి

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles