కళ్లుచెదిరే.. రాజసం!


Sun,November 25, 2018 01:17 AM

anushka
రాజులంటేనే.. రాజసం ఉట్టిపడుతుంది.. దానికి తోడు అందమైన భవంతులు.. కళ్లు చెదిరే ఉద్యానవనాలను ఊహించుకోవచ్చు.. ఇప్పుడు ఆ రాజులు లేరు.. రాజ్యాలు లేవు.. కానీ వారు ధరించిన నగలు కొన్ని మ్యూజియాల్లో ఉన్నాయి.. కొన్ని ఫొటోల రూపంలో మనకు దర్శనమిస్తున్నాయి.. భారతదేశంలో రాజులు.. రాణులు ధరించిన.. విలువైన నగల గురించే ఈ జంటకమ్మలో
చెప్పబోతున్నాం.. కళ్లు విప్పారించి మరీ ఆ నగలపై ఓ లుక్కేయండి..

Jewellery

పగిడి మెరుపు

ఈ ఫొటోలో కనిపించేది మహరాజా దులీప్ సింగ్. లాహోర్‌కి చెందిన సిక్ చక్రవర్తుల్లో ఈయన చివరివాడు. ఇతనికి నగలంటే మోజు. ఎంతో విలువైన నగల కలెక్షన్ ఇతని దగ్గర ఉండేది. ముఖ్యంగా ఈయన తల పాగాకి పెట్టె పగిడి మొత్తం డైమండ్లతో ఉండేది. మధ్యలో ఎమరాల్డ్ కరెక్ట్‌గా మెరుస్తుంటుంది. ఇక కింద వైపు మాత్రం మంచి ముత్యాలతో చైన్లుగా వేసేవాడు.
Jewellery3

కేక క్రౌన్

ఇప్పుడు అందాల పోటీల్లో గెలిస్తే క్రౌన్‌లు పెడుతున్నారు. కానీ ఒకప్పుడు మహారాణులు, యువరాణుల నగల్లో క్రౌన్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే! భారతీయులు ఎక్కువ బంగారాన్ని వినియోగిస్తారనే వాదన ఉన్నది. కశ్మీరీ యువరాణి కూడా మొత్తం బంగారంతో, చిన్న డైమండ్‌ని చేర్చి క్రౌన్ చేయించుకుంది. ఇందులో పక్షులు, పురుషులు, ఖగోళాన్ని డిజైన్‌గా చెక్కారు. 9వ శతాబ్దం నాటి ఈ రాయల్ ఆభరణం ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తున్నది.
Jewellery4

ముత్యాలహారం

మంచి ముత్యాలు ఎప్పటికీ మెరుపును కోల్పోవు. అలాంటి నగల ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బరోడాకి చెందిన మహారాజా కండే రావు గైక్వాడ్ 1860లో 7 వరుసలతో ముత్యాల హారాన్ని చేయించుకునానడు. నేచురల్ ముత్యాలతో తయారు చేసిన ఈ హారం ఎక్కువగా ధరించేవాడు. 150 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ ముత్యాలు మెరుపు తగ్గలేదు. సుమారు 350 ముత్యాలతో ఈ నగను తయారుచేశారు. ఈ గైక్వాడ్ దగ్గర మూడు వరుసల డైమండ్ నెక్లెస్ కూడా ఉండేది. అది కూడా చాలా విలువైనది.
Jewellery2

డైమండ్ల జిగేలు

నగలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. పటియాలాకి చెందిన మహారాజా భూపేందర్ సింగ్ ప్రపంచంలోనే 7వ అతి పెద్ద డైమండ్స్‌ని తన నగల్లో చేర్చాడు. ముఖ్యంగా ఈ నగను చూడండి.. ఇందులో 234 క్యారెట్ యెల్లో డీ బీర్స్‌ని పొందుపరిచారు. మొత్తం 2,930 డైమండ్లు ఈ నగలో ఉన్నాయి. ఇవి కాకుండా.. ప్లాటినం, జీరోకొనియాస్, టోపేజ్, సింథటిక్ రూబీస్, స్మోకీ క్వార్టజ్, సిట్రైనీ ఇందులో ఉండడంతో నగ మరింత మెరిసిపోతున్నది. ఈ నగను 1928లో కార్టియర్ పారిస్‌లో తయారు చేయించారు.
Jewellery5

చారిత్రకం..

పటియాలా మహారాజుగా భూపేంద్ర సింగ్ ఉండేవాడు. వారి సంప్రదాయం ప్రకారం తలపాగా తప్పక ఉండాల్సిందే! దానిమీద పగిడి పెట్టుకునేవాడు. అది కూడా ఎంతో విలువైన వజ్రాలను పొందుపరిచిన దాన్ని ధరించేవాడు. ఆయన కాలంలోనే బ్రిటీషులు భారతదేశంలోకి వచ్చారు. అప్పటి నుంచి వారి క్రౌన్‌లు రాజ్యమేలాయి. దాదాపు ఈ పగిడి ధరించడం ఈయనతోనే ఆగిపోయిందనుకోవచ్చు. అందుకే ఈ విలువైన పగిడి చరిత్రలో నిలిచిపోతుంది. పైగా దీన్ని వేలం వేస్తే లక్షా 70వేల డాలర్లకు అమ్ముడుపోయింది.
Jewellery7

128 కేరట్లు..

డైమండ్ల జిలుగులు ఎక్కడున్న మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మహారాణులు సైతం ఆ నగలకు దాసోహం అన్నవారే! బరోడా మహారాణి సీతాదేవి అరుదైన నగను సొంతం చేసుకుంది. 128 క్యారట్ల సౌత్ డైమండ్‌తో మూడు వరుసల డైమండ్ నెక్లెస్‌ని డిజైన్ చేయించారు. దాంట్లో 78.5 క్యారట్లు ఇంగ్లిష్ డ్రెస్డెన్ డైమండ్‌ని కూడా పొందుపరిచారు. మహారాణికి ఈ నగను బరోడా గైక్వార్ అయిన ముల్‌హర్ రావు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే దీని ధర సుమారు 20లక్షల రూపాయలు. కొన్నిరోజుల కి ముంబైకి చెందిన రూస్తోమ్‌జీ జమ్‌సేట్‌జీ వేలం పాటలో దీన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2002లో దీన్ని పారిస్‌కి చెందిన కార్టియర్ నగల దుకాణం దీన్ని సొంతం చేసుకుంది.
Jewellery6

ఆధారాలు లేవు

ఒకటవ శతాబ్దంలో బంగారాన్ని వాడేవారు. ఇది చారిత్రకంగా నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తవ్వకాల్లో ఈ బంగారు చెవి కమ్మలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలం నాటివని గుర్తించారు. కానీ ఇవి కచ్చితంగా ఈ రాజు లేదా రాణి ధరించాడనే ఆధారాలు మాత్రం లభించలేదు. ఏదైతేనేం.. వింత డిజైన్లతో అప్పటి కళాకృతులను మనం చూడొచ్చు.
Jewellery8

రూబీ చోకర్

1931లో కార్టియర్ ఈ నగను డిజైన్ చేశారు. ప్లాటినంతో అవుట్‌స్టాండింగ్‌గా దీన్ని అల్లారు. దీనికి రూబీలు, ముత్యాలు, డైమండ్స్‌ని జతచేశారు. పైన వైపు ఆరు లేయర్లుగా రూబీలు, డైమండ్లు ఉన్నాయి. మధ్యన రుబీలు, ముత్యాలను అల్లారు. కింద వైపు హెవీగా ఉండేలా ఎక్కువగా రూబీలు, డైమండ్లు ఇచ్చేసరికి మరింత మెరిసిపోతున్నదీ నగ. దీన్ని మహారాజా భూపేందర్ సింగ్ తన భార్య మహారాణి శ్రీ భక్తావర్ కౌర్ సాహిబాకి బహుమతిగా ఇచ్చాడు.
Jewellery9

ఎమరాల్డ్ నెక్లెస్

గుజరాత్‌ని జమనగర్ అని ఉంది. అప్పట్లో దాన్ని నవనగర్ అని పిలిచేవారు. దాన్ని పాలించిన మహారాజుకు వజ్ర వైఢూర్యాలంటే మక్కువ. అందుకే ఎమరాల్డ్స్, డైమండ్స్‌తో ఒక నగ చేయించుకున్నాడు. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న 17 ఎమరాల్డ్‌లను ఈ నెక్లెస్‌లో పొందుపరిచారు. వీటి బరువు సుమారు 277 కేరట్లు. ఇందులో కేవలం లాకెట్ బరువు 70 క్యారట్లు. ఆ తర్వాతి కాలంలో టర్కీ సుల్తాన్ నగల కలెక్షన్‌లలో ఈ నగ కూడా చేరిపోయింది.

-సౌమ్య పలుస

343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles