కంఫర్ట్ ఫిట్..


Sun,December 2, 2018 01:51 AM

fashion
అందరూ ఒకేలా రెడీ అవుతున్నారా?దీనికి సమాధానం కాదు అనే కదా!అలాంటప్పుడు అందరిలా.. షర్ట్‌లకు.. జాకెట్‌లకుపొట్టి చేతులు.. పొడుగు చేతులే కుట్టిస్తే ఎలా మరి! స్లీవ్స్‌లో కూడా బోలెడు రకాలున్నాయండోయ్.. మీ కంఫర్ట్‌ని చూసుకొని.. మీకు ఏ స్లీవ్స్ సూటవుతుందో.. ఏ అకేషన్‌లో ఈ స్లీవ్స్‌తో అదురగొట్టేయొచ్చో.. ఈ జంట కమ్మలో సవివరంగా ఇస్తున్నాం.. ఇక జరిగే పెండ్లిండ్లలో.. పార్టీలో మీరే సెంటరాఫ్ ఎంట్రాక్షన్ అవ్వొచ్చు..
- సౌమ్య పలుస

fashion2

ఫ్రెంచ్ స్లీవ్స్

ఫార్మాల్‌గా ఉండాలనుకునే అమ్మాయిలు కుట్టించుకునే స్లీవ్స్ ఇవి. ఫుల్ స్లీవ్స్.. కఫ్ లింక్స్‌తో చూడముచ్చటగా ఉంటాయి. కార్పొరేట్ పార్టీలకు, ఫార్మల్ లుక్‌తో మెరిసిపోయేందుకు ఈ స్లీవ్స్ బాగుంటాయి. వర్కింగ్ లేడీస్ ఇలాంటి స్టయిల్‌తో అందరిలో స్పెషల్‌గా కనిపిస్తారు. ప్లెయిన్ షర్ట్స్‌లకు ఈ స్లీవ్స్ చాలా బాగుంటాయి.
fashion3

పోయెట్ స్లీవ్స్

2018లో డ్రెస్ లిస్ట్‌లో టాప్‌లో ఉండాల్సినవి ఇవే! మోచేతుల వరకు బిగుతుగా ఉండి చివర వరకు వదులుగా ఉంటాయి. వీటిని పోయెట్ స్లీవ్స్ అని పిలుస్తారు. ఫంకీ ప్యాటర్న్ ైస్టెల్‌గా దీన్ని చెప్పొచ్చు. షార్ట్ స్కర్ట్‌ల మీదకి, పలాజో ప్యాంట్‌ల మీదకి ఈ టాప్ స్లీవ్స్ కంప్లీట్ లుక్‌ని తెచ్చి పెడుతాయి. అన్నిచోట్లకి ఈ స్లీవ్స్ ఉన్న డ్రెస్‌లు బాగుంటాయి.
fashion4

మారీ స్లీవ్స్

ర్యాంప్‌ల మీద ఇలాంటి స్లీవ్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. మామూలుగా అయితే ఒక పఫ్ పెట్టిస్తారు. దీనికి చాలా పఫ్స్ వచ్చి మధ్యలో రిబ్బన్స్ వస్తాయి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ పెట్టినప్పుడు ఈ స్లీవ్స్ పెట్టిన షార్ట్ గౌన్ వేసుకొని మోకాళ్ల వరకు సాక్సులు, బూట్లతో అదరగొట్టేయొచ్చు. డిన్నర్ నైట్స్, ఫెయిర్‌వెల్ పార్టీలకు ఇది పర్‌ఫెక్ట్ చాయిస్.
fashion5

లాంతర్ స్టీవ్స్

సన్నగా చేతులు ఉండేవాళ్లకి ఈ రకం స్లీవ్స్ బాగా నప్పుతాయి. కింద వైపు కాస్త వదులుగా ఉంటాయి. ఇలాంటి స్లీవ్స్ మిమ్మల్ని బొద్దుగా చూపిస్తాయి. వెస్ట్రన్ టైప్ కాకుండా ఇండియన్ టైప్ డ్రెస్‌లకు ఇలాంటి స్లీవ్స్ కరెక్ట్. ఇంకా ఎక్కువ ఎంబ్రాయిడరీ, మెరిసే ఫ్యాబ్రిక్‌లతో ఈ స్లీవ్స్ కుట్టిస్తే మరింత బాగుంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్, పండుగలు, పెండ్లిండ్లలో వేసుకొనే డ్రెస్‌లకు ఇలాంటి స్లీవ్స్ ట్రై చేయండి. కాలేజ్‌కి వెళ్లేవాళ్లు ఈ స్లీవ్స్ ట్రై చేసి తమకు ఫ్యాషన్ సెన్స్ ఉందని స్టేట్‌మెంట్ ఇవ్వొచ్చు.
fashion6

జూలియట్ స్లీవ్స్

షేక్‌స్పియర్ రాసిన రొమాంటిక్ నవలలో రోమియో, జూలియట్ క్యారెక్టర్లు ఎంతో ఫేమస్. అక్కడి నుంచి ఈ పేరును తీసుకొని ఈ స్లీవ్స్‌కి ఆ పేరు పెట్టుకున్నారు. పైన బుగ్గలా వచ్చి కింద టైట్‌గా ఈ డిజైన్ వస్తుంది. రాయల్ లుక్‌తో మెరిసిపోయేందుకు ఈ స్లీవ్స్ కుట్టించుకోండి. అయితే కాపర్, సిల్వర్, గోల్డ్ కలర్ అది కూడా రాసిల్క్‌లాంటి మెటీరియల్‌తో కుట్టించుకుంటేనే ఆ అందమే వేరు. గ్రాండ్ పార్టీలకు ఇలాంటివి సూటవుతాయి.
fashion7

బెల్ స్లీవ్స్

ఈ స్లీవ్స్ బెల్ బాటమ్ ప్యాంట్‌లని పోలి ఉంటుంది. మోచేతి వరకు ఒకలా వచ్చి కింద చాలా వదులుగా కుచ్చులుగా వస్తుంది. కింద కచ్చితంగా హెమ్మింగ్ చేయించాల్సిందే. ఇలాంటి స్లీవ్స్ క్లాసీ లుక్‌ని తీసుకొస్తాయి. ఈ హ్యాండ్స్ ఉన్న డ్రెస్‌లను ఆఫీస్ మీటింగ్స్, ఫార్మాల్ మీటింగ్స్‌లకు వేసుకోవచ్చు. ఫేర్‌వెల్ పార్టీలకు, రాత్రుల్లో జరిగే పార్టీలకు ఇవి పర్‌ఫెక్ట్. బెల్ స్లీవ్స్ ఉన్న డ్రెస్ వేసుకున్నప్పుడు జుట్టు మీద శ్రద్ధ పెట్టాలి. ఫుట్‌వేర్ పట్ల దృష్టి పెడితే కచ్చితంగా మీ లుక్‌ని పూర్తిగా మార్చేసుకోవచ్చు.
fashion8

సర్క్యులర్ క్యాప్ స్లీవ్స్

చిన్న క్యాప్ స్లీవ్స్‌ని కాస్త పొడుగు చేస్తే ఈ రకమైన స్లీవ్స్ సాధ్యమవుతాయి. కింద వైపు గుండ్రంగా ఉంటుంది కాబట్టే దీన్ని సర్క్యులర్ అంటారు. ఈ మధ్యకాలంలో ఈ స్లీవ్స్ టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. పార్టీ డ్రెస్‌లకు ఇలాంటి స్లీవ్స్ ఉన్న డ్రెస్‌లు వేసుకొని స్టన్నింగ్‌గా కనిపించొచ్చు. షార్ట్ కుర్తా, ఫ్రాక్‌లకు ఇది సరిగ్గా సరిపోతుంది. స్పెషల్ డేట్ నైట్స్, పార్టీలకు, ఇతర ప్రత్యేకమైన అకేషన్‌లలో వేసుకోవచ్చు.
fashion9

రాగ్లన్ స్లీవ్స్

పాపులర్ స్లీవ్స్‌గా వీటిని చెప్పొచ్చు. నెక్ నుంచి కింద వరకు ఒకేలా ఉంటాయి ఈ స్లీవ్స్. ఈ స్లీవ్స్ లెంగ్త్ మనం చిన్నగా నుంచి పెద్ద వరకు నచ్చినట్టుగా పెట్టించుకోవచ్చు. ఎక్కువగా వీటిని స్పోర్ట్స్‌వేర్‌లకు కుట్టించుకుంటారు. బాబీకాన్ డ్రెస్‌లకు కూడా ఇవి బాగుంటాయి. బేబీకాన్ డ్రెస్‌లకు ఈ స్లీవ్స్ కుట్టించుకొని పెద్ద పార్టీలకు కూడా వేసుకెళ్లొచ్చు. దీనికి పర్‌ఫెక్ట్ షూ ఉంటే అదిరేటి లుక్ మీదే అవుతుంది.
fashion10

బ్యాట్‌వింగ్ స్లీవ్స్

ఇంగ్లిష్‌లో బ్యాట్ అని దేనినంటారు.. అదేనండీ గబ్బిలం. దాని రెక్కలు ఎలాగైతే ఉంటాయి ఈ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. అలా దీనికి ఆ పేరు పెట్టారంట. చేతివేళ్ల వరకు ఈ స్లీవ్స్ వస్తాయి. షర్ట్‌లాంటి వెస్ట్రన్ డ్రెస్‌లకు ఈ స్లీవ్స్ బాగుంటాయి. అంటే.. ట్యూనిక్స్, టాప్స్‌లాంటివన్నమాట. ఎలాంటి అకేషన్‌కైనా ఈ డ్రెస్‌లను వేసుకోవచ్చు. క్యాజువల్ ఈవెంట్స్‌ల్లో ఇంకాస్త అందంగా మెరిసిపోవచ్చు.
fashion11

బిషప్ స్లీవ్స్

పాత దానికి కొత్త సొబగులద్ది రూపొందించినవే ఈ స్లీవ్స్. ఒకప్పుడు బిషప్‌లు వేసుకునే కోట్‌లకి స్లీవ్స్ ఇలాగే ఉండేవి. ఫుల్ లెంగ్త్.. పైన టైట్‌గా.. కింద వదులుగా ఉండడమే ఈ స్లీవ్స్ స్పెషాలిటీ. టాప్స్, ట్యూనిక్స్ వేసుకొని వాటికి ఈ స్లీవ్స్ కుట్టించుకోండి. వీటికి క్రాప్డ్ జీన్స్, బాయ్‌ఫ్రెండ్ జీన్స్‌ని జతచేయండి. ఎక్కువ యాక్ససెరీస్ లేకుండా.. రోజూ కాలేజ్‌కి వెళ్లడానికి, ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌కి వెళ్లినప్పుడు ఈ స్లీవ్స్ ఉన్న డ్రెస్‌లను ధరించండి. అయితే లైట్ కలర్స్ కాకుండా కాస్త డార్క్ ఉన్న షర్ట్‌లు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles