ఈమెకు గాయాల బాధే లేదు!


Sun,April 21, 2019 02:59 AM

ప్రమాదవశాత్తు శరీరానికి ఎక్కడైనా గాయాలయినప్పుడు ఆ గాయాల వల్ల కలిగే నొప్పిని అస్సలు భరించలేం. నొప్పి తగ్గాలంటే కచ్చితంగా ఏ మందో, మాకో వేసుకోవల్సిందే. అయితే ఎటువంటి గాయాలయినా కాలినా, ఏ రకంగా ప్రమాదం సంభవించినా సరే జో కామెరాన్‌కు నొప్పి అనేదే తెలియదు.
NoPain

ఎటువంటి చికిత్స గానీ, మందులు గానీ అవసరం లేకుండానే అస్సలు నొప్పి ఉండదా? ఎంత బాగుంటుంది. వింటుంటే కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది మాత్రం నిజం. ఇంగ్లాండ్‌కు చెందిన జో కామెరూన్ అనే మహిళకు గాయాలైతే నొప్పే కాదు దానికి సంబంధించిన భయం, ఆందోళన అసలే తెలియవు. ఎవరికీ లేని సమస్య ఆమెకు ఉన్నది. ప్రపంచంలోనే ఇటువంటి అరుదైన సమస్య ఇద్దరికి మాత్రమే ఉన్నది. కామెరాన్ వంట చేస్తున్నపుడు ఎన్నో సార్లు కాలి గాయాలు అయ్యాయి. కానీ ఆమెకు నొప్పి తెలియదు. పక్కన ఎవరైనా గమనించి నీకు దెబ్బ తగిలినట్లుందే అని చెబితే తప్ప ఆమెకు గాయమైన విషయం అర్థం కాదు మరి. ఓ సారి వంట గదిలో వంట చేస్తూ ఉన్నది కామెరాన్. ఆ సమయంలో తన శరీరం కాలింది. ఆ విషయం చర్మం కాలుతున్న వాసన రావడంతో అర్థమయిందే తప్ప తనకు గాయమయిందని తెలియలేదు. కామెరాన్ వంట చేసే టప్పుడు ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఆమె అరుదైన సమస్య ఉండడం వల్ల నొప్పి, భయం, ఆందోళన కానీ ఏమీ తెలియవు. 65 యేండ్ల వయసులో కామెరాన్‌కు ఒక పెద్ద శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ పూర్తయ్యాక, తనకు పెయిన్ కిల్లర్స్ అవసరంలేదు అని కామెరూన్ అంటే, మొదట్లో డాక్టర్లు నమ్మలేకపోయారు. తన చేతికి ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు ఆమెను హెచ్చరించారు. తీవ్రమైన నొప్పిని తట్టుకునేందుకు ఆమెకు మత్తుమందు ఇవ్వడానికి వచ్చిన వైద్యుడు డా.దేవ్జిత్ శ్రీవాస్తవ కామెరాన్ సమస్యను గురించి మొదటగా తెలుసుకున్నారు. ఆమె చెప్పిన అన్ని విషయాలు తెలుసుకున్న ఆ తర్వాత ఆమెను యూనివర్సిటీ ఆఫ్ లండన్ అండ్ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పెయిన్ జెనిటిసిస్ట్ వద్దకు పంపారు. ఆమె ఎదుర్కొంటున్న వింత సమస్యను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అందరిలా కామెరాన్‌కు నొప్పి, బాధ కలుగకపోవడానికి కారణం జన్యుమార్పులేనని వైద్యులు తేల్చారు.

396
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles