ఇరవై ఏళ్ళ నాటి హత్య


Sun,September 2, 2018 01:23 AM

Crime
చట్టప్రకారం నేను వీటిని వేయాలి. కానీ, నువ్వు పారిపోయే ప్రయత్నం చేయవని నాకు తెలుసు. నా వెంట పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేటిమెంట్ ఇస్తావా? నీ అంతట నువ్వు ఒప్పుకుంటే ఈ రాష్ట్రంలో మరణ శిక్ష పడదు. లేదా...ఏ
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

భై ఐదేళ్ళ షెరీఫ్ హోగన్ కారు దిగి వష్టా నది ఒడ్డున కనపడే బుల్డోజర్ల వైపు నడిచాడు. అతణ్ని చూసిన నలుగురు పనివాళ్ళు దూరం నించే విష్ చేసారు.
నా పేరు హోగన. మీలో బిల్ ఎవరు? షెరీఫ్ ప్రశ్నించాడు. ఆ నలుగురిలోని ఒకరు ముందుకి వచ్చి చెప్పాడు. నేనే బిల్లి. ఆ కపాలం నాకే కనపడింది.
ఏం జరిగిందో చెప్పు
వంతెన నిర్మాణానికి నేను ఇక్కడి మట్టిని చదును చేస్తున్నాను. మట్టిలో ఏదో తెల్లగా, గుండ్రంగా, మెరుస్తూ కనిపిస్తే, బుల్డోజర్నీ ఆపి దిగి చూసాను. మట్టి మధ్య ఉన్నది కపాలంగా గుర్తించాను. మానవ కపాలం! వెంటనే మీకు ఫోన్ చేసాను.
ఇది సరిగ్గా ఎక్కడ దొరికింది? షెరీఫ్ నేల మీద ఓ చోట ఉన్న దాన్ని అందుకుని, పరిశీలనగా చూసి అడిగాడు. ఇరవై గజాల మేర చదును చేసాను. ఈ ఎర్ర జెండాలు పాతిన పరిథిలో ఓ చోట దొరికింది. ఎముకలు కాని, మిగిలిన అస్థిపంజరం కానీ దొరకలేదా? షెరీఫ్ ప్రశ్నించాడు. లేదు. నలుగురం కలిసి మిగతా మట్టిని పారలతో తవ్వి వెతికి చూసాం. దొరకలేదు.
షెరీఫ్ కారు పక్కన ఓ కేడీలాక్ కారొచ్చి ఆగింది. అందులోంచి దిగిన పోలీస్ డాక్టర్, షెరీఫ్ హోగస్ దగ్గరకి వచ్చి అడిగాడు.
హలో షెరీఫ్ హోగన్. నన్నెందుకు పిలిచారు?
అది ఎవరిదో నేను చెప్పగలను. ఇరవై ఏళ్ళ క్రితం నేను మూసేసిన ఓ కేసులో కనపడకుండా పోయిన అమ్మాయిది. మీరు ఈ పుర్రెని మీతో తీసుకెళ్ళి పరీక్షించండి. తలమీద దెబ్బ, రివాల్వర్ గుండు లాంటివేమైనా దొరకచ్చు.జోగన్ కోరాడు.
అలాగే. తర్వాత హోగన్ ఆ పనివాళ్ళతో చెప్పాడు.
మీకు ఈ రోజు, రేపు సెలవు. మిగిలిన అస్థిపంజరం కోసం మేము ఇక్కడ వెతుకుతాం. మాకు కనపడకపోతే ఎల్లుండి కూడా మీకు సెలవు ఉండచ్చు. మీ బాస్‌కు ఈ విషయం చెప్పండి.
* * *

హోగన్ తన ఆఫీస్‌లోని ఫైల్ రేర్ లోంచి రెండు పాత ఫైల్స్ ని బయటకి తీసి వాటిని శ్రద్ధగా చదివాడు. ఆ కేసులో వివరాలు చదువుతూంటే అతనికి గుర్తుకు వచ్చింది. అతను ఇరవై ఏళ్ళ క్రితం డెప్యూటీ షెరీఫ్గా చేరిన కొత్తల్లో కనపడకుండా పోయిన ఇద్దరు టీనేజ్ అమ్మాయిల రేసులవి.
వారిలో ఒకమ్మాయి పేరు నేన్సీ. తన పంతొమ్మిదో ఏట ఆమె అకస్మాత్తుగా కనపడకుండా పోయింది. అతనా పుర్రెని నేన్సీదిగా భావించడంతో ఆ కేసులో జీవించి ఉన్న వారితో మరోసారి మాట్లాడాలని అనుకున్నాడు. ఫీలింగే నేన్సీని చంపి, కనపడటం లేదని ఫిర్యాదు చేసాడని హోగస్ అప్పట్లో నమ్మాడు. ఫీలింగ్ తన భార్య చెల్లెలు నేన్సీని చంపాడని కేస్ ఫైల్ చేయడానికి గనకి ఆమె శవం లభ్యం కాలేదు.
ముందుగా కోళ్ళు, పశువుల దాణా అమ్మే షాప్‌కి వెళ్ళాడు. అప్పట్లో సాడైన ఫెర్నాండేజ్ అందులో పని చేసేవాడు. దాని యజమాని కూతుర్ని పెళ్ళి చేసుకున్నాక ఇప్పుడు దానికి తనే యజమాని అయ్యాడు. బోగస్ ప్రశ్నలు విని నలభై ఏడేళ్ళ ఫెర్నాండేజ్ చెప్పాడు.
ఎంత? ఇరవై ఏళ్ళైందా? నాకు అలా అనిపించడం లేదు. నేను అప్పట్లో ఫీల్డింగ్ పొలంలో శనాదివారాలు పని చేసే వాడిని. నేను అలా సెలవు తీసుకోకుండా కష్టపడి పని చేయడం చూసే నా బాస్ నాకు తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆయన శ్రమ విలువ తెలిసిన మనిషి ఆ ఆదివారం నేనీ చేతిలో పెట్టి పట్టుకుని వషిటా నది ఒడ్డుకి చీకటి పడుతూండగా వెళ్ళడం నేను చూసాను. ఆమె బ్లౌజ్ బాగా చిరిగి ఉంది. పది నిమిషాల తర్వాత ఫీల్డింగ్ అక్కడ నాకు కనపడ్డాడు. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఆయన తన కార్లో నేన్సీ వెళ్ళిన వైపు వెళ్ళడం చూశాను. అంతకు మునుపు ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలీదు. సారాకి తెలుసు. అప్పట్లో ఆమె ఫీల్డింగ్ ఇంట్లో మెయిడ్‌గా పని చేసేది.

థాంక్స్.
తొంభై మూడేళ్ళ సారా ఆనాటి సాక్షుల్లో ఒకరు. ఆమె అప్పట్లో ఫీల్డింగ్ ఇంట్లో పనిమనిషిగా చేసేది.
హోగన్ సరాసరి సారా నివసించే బీద ఇంటికి వెళ్ళాడు. ఆ నదికి తూర్పు వైపున ఉన్న ఇళ్ళన్నీ బీదవాళ్ళయే. ఆవిడ కిటికీలోంచి నదిలోని చేపలను పడుతున్నది.
మీ జ్ఞాపకశక్తి ఎలా ఉంది? అడిగాడు. ఎవరి గురించి వచ్చావు? ఆవిడ ఎదురు ప్రశ్న వేసింది. ఫీల్డింగ్ మరదలు నేన్సీ గురించి. నా వయసిప్పుడు డ్బ్బై మూడు కాదు. కాని ఆ రోజు జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆవిడ చిన్నగా నిట్టూర్చి, కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని చెప్పింది.
ఫీలింగ్ భార్య మరణించాక నేను అతనింట్లో పనిమనిషిగా చేరాను. వంట కూడా చేసేదాణ్ని. అతని భార్య చెల్లెలు నేన్సీ. కాలేజీలో చదివే నేన్సీ అక్క పోతే చూడటానికి వచ్చింది. ఆమె తన అక్క మరణానికి బాగా కృంగిపోయింది. రెండు నెలలు కాలేజీకి వెళ్ళలేదు. అకస్మాత్తుగా ఫీలింగ్ ఆమె పరిపూర్ణ స్త్రీ అని గుర్తించాడు. అక్క కన్నా నేన్సీ అందంగా ఉండేది. తనని పెళ్ళి చేసుకోమని నేన్సీకి చెప్పమని నన్ను కోరాడు. వారి మధ్య ఇరవై మూడేళ్ళ తేడా. కాబట్టి అది అన్యాయమని, నేను చెప్పననీ తిరస్కరించాను. ఫీల్డింగ్ అడిగితే ఆమె కూడా తిరస్కరించి ఉండాలి. మర్నాడు నేన్సీ కాలేజీ హాస్టల్‌కి వెళ్ళిపోతున్నానని నాతో చెప్పింది.

హోగన్ ఇదంతా ఫైల్లో చదివాడు. సారా జ్ఞాపకశక్తి పటిష్టంగా ఉందని గుర్తించాడు. ఆ రాత్రి ఏమైందో చెప్పు. అడిగాడు. ఆవిడ గేలానికి చేప పడింది. దాన్ని తీసి మళ్ళీ కొత్త పురుగుని గేలానికి గుచ్చి, నీళ్ళల్లో వేసి చెప్పింది.
నేను వంటగదిలో ఉన్నాను. వాళ్ళు డైనింగ్ హాల్లో ఉన్నారు. ఫీల్డింగ్ తాగి ఉన్నాడు. తనని పెళ్ళి చేసుకోడానికి తిరస్కరించినందుకు ఆమెని తిట్టసాగాడు. నన్ను ముట్టుకోకు. దూరంగా జరుగు అని నేన్సీ అరిచింది. నేను గుమ్మంలోంచి చూస్తే అతను ఆమె బ్లౌజ్‌ని చింపేసాడు. నేను కల్పించుకోదలచుకోలేదు. ఆమె లేచి వెళ్ళిపోయింది. అతను ఆమెకి కాలేజీ చదువుకి ఇక డబ్బు పంపనని చెప్పి బెదిరించాడు. ఆమె సూట్‌కేస్ తీసుకుని వెళ్ళిపోయిందని మా ఇద్దరికీ తెలీదు. ఎందుకంటే, కారు స్టార్ట్ చేసిన శబ్దం మా ఇద్దరికీ వినిపించలేదు. నేన్సీ తన కారులో కాక కాలి నడకన వెళ్ళిపోయింది. సుమారు పది నిమిషాల తర్వాత ఫీల్డింగ్ ఆమె గదిలోకి వెళ్తే లేదు. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసి బయటకి వెళ్ళాడు. నాకు కారు స్టారైన శబ్దం వినిపించింది. అంతే, నేను చూసింది.
వెళ్తూ అతను రివాల్వర్ని తీసుకెళ్ళాడు కదా?
అవును. దాంట్లో గుళ్ళు నింపి తీసుకెళ్ళడం చూసినా నేను కల్పించుకోలేదు. అప్పటి ఆయన మూడ్‌ని చూస్తే నేనేం వ్యతిరేకంగా మాట్లాడినా నన్నూ కాల్చేస్తాడని భయపడ్డాను.
థాంక్స్

హోగన్ ఇద్దరు జీవించి ఉన్న సాక్షులతో మాట్లాడాక సరాసరి ఫీల్డింగ్ ఇంటికి వెళ్ళాడు. అరవై పై బడ్డ ఫీల్డింగ్ హోగన్ని చూసి బలహీనంగా నవ్వాడు.
హలో ఫీల్డింగ్ గుర్తున్నానా? పలకరించాడు.
గుర్తున్నారు. ఇరవై ఏళ్ళ క్రితం మీరు డిప్యూటీ షెరీఫ్గా ఉండగా... నేన్సీ అస్థిపంజరం దొరికిందని విన్నాను. ఎక్కడ దొరికింది?
నది ఒడ్డున. నువ్వు దాన్ని పాతిన చోటే. నేను ఆమెని చంపలేదు. ఆ రాత్రి ఆమె నాకు కనపడలేదు ఫీల్డింగ్ చెప్పాడు.
నేను అది అప్పుడూ నమ్మలేదు. ఇప్పుడూ నమ్మను. కానీ, శవం దొరక్కపోవడంతో ఏం చేయలేక పోయాను. ఇప్పుడు ఋజువు కూడా దొరికింది. ఆ రివాల్వర్ గుండు అస్థిపంజరంలో దొరికింది. ఎందుకైనా మంచిదని నీ రివాల్వర్‌ని మా ఆధీనంలో ఉంచుకోవడం మంచిదైంది. అది నీ రివాల్వర్ నించి పేల్చిన గుండే అని ఫోరెన్సిక్ నిర్ధారణ అయ్యాకే వస్తున్నాను.
ఫీల్డింగ్ మరోసారి బలహీనంగా నవ్వి చెప్పాడు. చాలా లోతుగా పాతాను, కాని అక్కడే వంతెన కడతారని నేను ఎలా ఊహించగలను? హోగన్ బేడీలని తీసి అడిగాడు.
చట్టప్రకారం నేను వీటిని వేయాలి. కానీ, నువ్వు పారిపోయే ప్రయత్నం చేయవని నాకు తెలుసు. నా వెంట పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేటిమెంట్ ఇస్తావా? నీ అంతట నువ్వు ఒప్పుకుంటే ఈ రాష్ట్రంలో మరణ శిక్ష పడదు. లేదా...

హోగన్ ఫీల్డింగికి ఒకటి, రెండు అబద్ధాలు చెప్పాడు. కానీ, నిందితుడితో నిజం చెప్పించడానికి అబద్ధం ఆడకూడదనే నియమం లేదు.
సిబ్బంది అస్థిపంజరం కోసం వెతుకుతూంటే హోగన్ ఇరవై ఏళ్ళ నాటి నేన్సీ కేస్ ఫైల్‌ని మూసేసి, ఇంకో పాత ఫైల్ చదవసాగాడు. డాక్టర్ నించి ఫోన్ వచ్చింది.
ఆ పుర్రె గురించి కొంత సమాచారం మీకు చెప్దామని ఫోన్ చేశాను. అది రెడ్ ఇండియన్ పుర్రె. బహుశ కియోవాబతికి చెందిన వాడిది. కనీసం వంద, నూట ఏభై ఏళ్ళ క్రితంది. పైన ఎక్కడో రెడ్ ఇండియన్స్ స్మశానం ఉండి ఉండాలి. నేను స్టేట్ యూనివర్సిటీకి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పబోతున్నాను. అది వాళ్ళకి ఆసక్తిగా ఉండచ్చు.
అది ఇరవై ఏళ్ళ క్రితం మరణించిన ఓ యువతికి చెందిన అవకాశం లేదా? హోగస్ ప్రశ్నించాడు. లేదు. దయచేసి ఓ సహాయం చేస్తారా? ఈ సమాచారం స్థానికులకి ఓ పన్నెండు గంటల పాటు తెలీకూడదు కోరాడు. అలాగే డాక్టర్ ఒప్పుకున్నాడు..
హోగస్ పంతొమ్మిదేళ్ళ క్రితం మాయమైన లెస్లీ భార్య లీనా ఫైల్ చదివాడు. ప్ళ్ళైన ఒకటిన్నర ఏళ్ళకి ఆమె కనపడకుండా పోయింది. సాక్ష్యాధారాలన్నీ ఆమెని లెస్లీ మాయం చేశాడని చెప్పాయి. కానీ, శవం దొరక్కపోవడంతో కేసుని ఫైల్ చేయలేకపోయారు. ఆ పుర్రె సాయంతో లెస్లీతో కూడా అతని నేరాన్ని ఒప్పించగలననే నమ్మకంతో బోగస్ అతని ఇంటికి బయలుదేరాడు.
(గేరీ డబ్ల్యు కేంప్బెల్ కథకి స్వేచ్ఛానువాదం)

952
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles