ఇంటెక్

Sun,December 2, 2018 01:02 AM

Nail-Station

నెయిల్ పాలిష్ కిట్!

మహిళలు నెయిల్ పాలిష్ పెట్టుకోవాలంటే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే పెట్టుకున్న వెంటనే ఏ పని చేసినా చెరిగిపోతుంది కాబట్టి. మరి సడన్‌గా పార్టీకి వెళ్లాలంటే.. వట్టి చేతులతో వెళ్లాల్సిందే. అలాంటి వారి కోసమే పోల్డర్ కంపెనీ యూవి లైట్ కంప్లీట్ నైల్ స్టేషన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కిట్‌లో చాలా రకాల నెయిల్ పాలిష్‌లు పెట్టుకోవచ్చు. దీనికి ఎల్‌ఈడి బల్బ్ ఉంటుంది. నెయిల్‌పాలిష్ పెట్టుకున్న తర్వాత వేళ్లు కిట్ లోపల పెట్టి బటన్ ఆన్ చేయాలి. లైట్ వెలుగడంతో పాటు ఫ్యాన్ గాలికి నెయిల్‌పాలిష్ వెంటనే ఆరిపోతుంది. దీనికి సెన్సార్‌ని కూడా అమర్చారు. ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆఫర్స్‌తో కలిపి దీని ధర సుమారు రూ. 2,800 వరకు ఉంటుంది.
Neutralizer

బ్యాక్టీరియాను చంపేస్తుంది!

పిల్లలు ఎక్కువగా చెట్టుకింద ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అప్పుడే దోమలు, కందిరీగలు, కీటకాల భారిన కూడా పడుతుంటారు. ఇవి కుట్టినప్పుడు రక్తాన్ని పీల్చడమే కాకుండా బ్యాక్టీరియాని శరీరంలోనికి పంపిస్తుంది. వెంటనే వైద్యం అందకపోతే రోగాల భారిన పడే ప్రమాదం ఉంది. అందుకే బైట్ హెల్పర్ కంపెనీ బగ్ బైట్ ఇర్రిటేషన్ న్యూట్రలైజర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దోమలు, కీటకాలు కుట్టిన ప్రదేశంలో బైట్ హెల్పర్‌ని కొంతసేపు పెట్టాలి. అలా చేయడం వల్ల కొంతమేరకు ప్రమాదాన్ని ఆపవచ్చు. ఆ తర్వాత డాక్టర్‌ను సంప్రదించొచ్చు. దీనికి బ్యాటరీస్‌తో పనిచేసే ఈ నూట్రలైజర్‌ను ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లో ఆఫర్స్‌తో కలిపి దీని ధర రూ. 2,090.

వి.వనజ
image

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles