ఇంటెక్


Sun,September 9, 2018 01:09 AM

digital-thermo-meter

స్మార్ట్ థర్మామీటర్!

మనకు ఇష్టమైన నాన్‌వెజ్, కేక్స్, చాక్లెట్స్ వంటివి ఇంట్లో తయారు చేస్తుంటాం. నాన్‌వెజ్‌ను ఎక్కువ మంటపై పెడితే మాడిపోతుంది. కేక్స్, చాక్లెట్స్ టెంపరేచర్ తక్కువలో పెడితే పాడవుతాయి. మరి ఎంత టెంపరేచర్ ఉందో తెలుసుకోడానికి స్మార్ట్ థర్మామీటర్ మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని స్టెయిన్ లెస్ స్టీల్, సిలికాతో తయారు చేశారు. థర్మామీటర్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఇచ్చిన ఆప్షన్‌కు కనెక్ట్ చేయాలి. థర్మామీటర్‌ను ఏ వస్తువు మీద పెడితే దాని టెంపరేచర్‌ను మొబైల్‌లో చూపిస్తుంది. అప్పుడు ఎలాంటి పొరపాట్లు జరుగుకుండా చూడొచ్చు. మీకిష్టమైన పదార్థం మాడిపోతుందన్న భయమే అక్కర్లేదు.
మార్కెట్‌లో దీని ధర రూ. 8,350 వరకూ ఉంటుంది.
వి. వనజ

Car-Charger

కార్ చార్జర్!

పని ఒత్తిడిలో మొబైల్‌కి చార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతుంటారు కొంతమంది. అయితే, కారులో ఒక మొబైల్ చార్జింగ్ పెట్టుకోడానికి సరిపోతుంది. మరి లాప్‌టాప్, ట్యాబ్‌కి కూడా చార్జింగ్ పెట్టుకోవాలంటే వేరే ఆప్షన్ ఉండదు. అందుకే, యూఎస్‌బీ కేబుల్‌తో రెండింటికీ ఒకేసారి చార్జింగ్ పెట్టుకునే సదుపాయం గల గ్యాడ్జెట్ మార్కెట్‌లోకి వచ్చేసింది. దీనిని కారులో ఇష్టమొచ్చిన ప్రదేశానికి మార్చుకోవచ్చు. ఇతర చార్జర్‌లతో పోలిస్తే ఇది చాలా తొందరగా చార్జింగ్ ఎక్కుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కారు అద్దాన్ని పగులగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్, స్టీల్‌తో దీన్ని తయారు చేశారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆఫర్స్‌తో కలిపి రూ. 1,259కే వస్తుంది.
portable-lights

పోర్టబుల్ లైటింగ్!

చీకట్లో చదువుకోవాలన్న, సెల్ఫీలు దిగాలన్న, స్కైప్‌లో వీడియో కాల్ మాట్లాడాలన్నా లైట్ కావాలి. అన్నీ చోట్ల కరెంటు ఉండాలంటే కష్టమే కదా. ఈ సమస్యకు పరిష్కారంగా పోర్టబుల్ లైట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. చిన్న సైజులో ప్లాస్టిక్, బల్బు, ఎల్‌ఈడీతో తయారు చేశారు. దీనిని గంటపాటు చార్జింగ్ పెడితే ఫుల్ అవుతుంది. లైట్‌ను లాప్‌టాప్, మొబైల్, పుస్తకం, ట్యాబ్, కెమెరాలకు కనెక్ట్ చేయవచ్చు. ఆ వెలుతురులో మీకు కావాల్సిన పనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆఫర్స్‌తో కలిపి దీని ధర రూ. 2,034కే దొరుకుతుంది.
Petchat

పెట్ చా ట్జ్!

చాలామంది వారి స్థాయికి తగ్గట్లుగా పెట్స్‌ను పెంచుకుంటున్నారు. వాటితో పెరిగిన మమకారం కారణంగా అవి కనపడకపోతే కంగారుపడుతారు. దూరపు ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లలేక, అలాగే ఇంట్లో వదిలేయలేక మథనపడుతుంటారు. అలాంటి వారి కోసం పెట్ చార్జ్ మార్కెట్‌లోకి వచ్చేసింది. ఈ గ్యాడ్జెట్‌లో పెంపుడు జంతువులతో వీడియోకాల్ మాట్లాడొచ్చు. అవి ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కానీ, పెట్స్‌కి మొబైల్ ఆపరేట్ చేయడం రాదుగా అనుకోవచ్చు. అందుకోసమే మనమే ఆ డివైజ్‌ను ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ డిస్‌ప్లే ద్వారా వీడియోకాల్ మాట్లాడొచ్చు. అంతేకాదు.. ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ వల్ల మీ పెట్ మీద ఎటువంటి దిగులు పెట్టుకోనవసరం లేదు. ఎక్కడున్నా.. వాటి బాగోగులు చూసుకోవచ్చు. మార్కెట్‌లో దీని ధర రూ. 44,757.

123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles