ఇంటెక్


Sun,March 11, 2018 01:11 AM

మొబైల్‌కు రెస్ట్ ఇవ్వండి

వీయూఫైన్+ అనే ఈ హైడెఫినేషన్ గ్యాడ్జెట్ మీ పక్కన ఉంటే.. ఫోన్‌ను ఇక పాకెట్‌లోనే ఉంచేయొచ్చు. ఎందుకంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మొబైల్ చూడాలి, బయటి ప్రపంచాన్ని చూడాలనిపిస్తుంది. అప్పుడు వీయూఫైన్+తో రెండింటినీ ఒక్కసారే చూడొచ్చు. లాంగ్ జర్నీలు చేసేవారు బోర్‌కొడితే ఫోన్‌లో వీడియోలు చూస్తూ టైంపాస్ చేస్తుంటారు. వీయూఫైన్+ పక్కనుంటే మీకు ఫోన్‌తో పనిలేదు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిని మొబైల్, లాప్‌టాప్, డ్రోన్‌లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర రూ.13 వేల నుంచి మొదలవుతుంది. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నది.
VUfine


ఎక్కడున్నా గుర్తిస్తుంది

ట్రావెలింగ్ చేసేవారు ఎప్పుడూ వెంట ఉంచుకోవాల్సిన గ్యాడ్జెట్ మ్యాగ్‌పై. ఇది జీపీఎస్ ట్రాకింగ్ ఆధారంగా పనిచేస్తుంది. తన పరిసరాల్లోని ఏ ఎలక్ట్రిక్ వస్తువునైనా సులభంగా గుర్తిస్తుంది. మీ ఫోన్‌కు దీనిని అనుసంధానం చేస్తే.. అది ఎక్కడ పోయినా వెంటనే గుర్తించి మీకు సిగ్నల్ అందిస్తుంది. దీనికి అనుసంధానం చేసిన గ్యాడ్జెట్‌ను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ట్రాక్ చేస్తుంది. ఇది ఎండకు ఎండినా, నీళ్లలో తడిసినా పాడవ్వదు. ఒక్కసారి దీనికి చార్జింగ్ పెడితే.. దాదాపు మూడు నెలలపాటు వస్తుంది. దీని ధర రూ.3 వేల నుంచి మొదవుతుంది. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నది.
GPS-Tracker

803
Tags

More News

VIRAL NEWS