ఆల్బమ్ గర్ల్!


Sun,December 2, 2018 03:25 AM

Malobika-Banerjee
విజయ్ దేవరకొండ.. ఇప్పుడు విజయాల కొండ అయ్యాడు.. టాప్ బ్రాండింగ్‌లతో పాటు.. స్పెషల్ సాంగ్‌లూ చేస్తున్నాడు.. ట్రెండ్ మ్యూజిక్‌లో చిన్మయి పాడిన పాట.. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్
దాటి ట్రెండింగ్‌లో ఉంది.. ఆ పాటలో విజయ్‌తో పాటు మెరిసిన అమ్మాయిని చూశారా? తెలుగు తెరపై ఎప్పుడూ చూడని అమ్మాయి గురించి ఇప్పుడు చాలామంది ఆరా తీస్తున్నారు.. ఆమె పేరు మలోబికా బెనర్జీ. బెంగాలీ భామ.. ఒక్క పాటతోనే తెలుగు వారి గుండెల్లో స్థానం సంపాదించిన.. ఈ ముద్దుగుమ్మ గురించి మరిన్ని విషయాలు మీకోసం..

- సౌమ్య పలుస
Malobika-Banerjee2
మలోబికాకు అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందట. మొదటి సినిమాలో డాన్స్ చేయడం చాలా కష్టమనిపించిందంటున్నది.

మొదటి సినిమా సూపర్‌హిట్. కానీ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు లేకపోవడంతో అవకాశాలు రాలేదు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. చదువంటే మలోబికాకి ప్రాణం. ఆ డిప్రెషన్‌లో నుంచి బయటకు రావడానికి చదువే మార్గమనుకుంది. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది.

తెలుగులో మూడు సంవత్సరాల క్రితమే వరుణ్ సందేశ్‌తో లైలా ఓ లైలా అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఆ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.

మలోబికాకి దీపికా పదుకొనే రోల్‌మోడల్. డిప్రెషన్ నుంచి బయటకొచ్చి అందమైన కెరీర్ నిర్మించుకున్న ఆమెను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుందంటున్న ది.

మలోబికా ప్రేమ, పెండ్లి వీటి మీద సీరియస్‌గా ఉంటానంటున్నది. ఏదైనా బంధం మొదలైతే 100 శాతం దానికి కట్టుబడి ఉండాలంటున్నది. ఇప్పటికైతే ఎలాంటి బంధంలో లేదట. కానీ కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటుందట.

దిల్‌బర్ అనే హిందీ ఆల్బమ్‌లో చాన్స్ రావడంతో బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటుంది.

టీ-సిరీస్ వాళ్లది ప్రిటీ గర్ల్ అనే ఒక ఆల్బమ్ రాబోతున్నది. అందులోనూ మలోబికా మెరువనున్నదట.

2008లోనే ఈ అమ్మడు సినీరంగ ప్రవేశం చేసింది. బెంగాలీ సూపర్ స్టార్ ప్రొసెన్‌జీత్ చటర్జీ నటించిన మిస్టర్ ఫంటూష్‌లో మెరిసింది.

ముంబైలో నీరజ్ కబీ దగ్గర యాక్టింగ్ పాఠాలు నేర్చుకుంటున్నది. డ్యాన్సింగ్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నది.
Malobika-Banerjee3
మలోబికా మిస్ కలకత్తా బ్యూటీ పెజెంట్ విన్నర్. ఆ కిరీటం గెలుచుకున్న తర్వాతే మొదటి సినిమా సంతకం చేసింది.

మలోబికాఇప్పటిదాకా బెంగాలీలో 15 సినిమాలు చేసింది.

484
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles