అరోరా.. ఔరౌరా!


Sun,September 2, 2018 12:46 AM

Sky
ఆకాశంలో, మేఘాలు తెల్లగా, నల్లగా ఉంటాయని తెలుసు. రాత్రి వేళ నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తాయనీ తెలుసు. సింగిడి(హరివిల్లు) వచ్చినప్పుడు ఏడు రంగులు కనిపిస్తాయని కూడా తెలుసు. మరి ఈ అరోరా గురించి విన్నారా? చదివారా? తీరొక్క రంగుల కొత్త ప్రపంచమిది.

ప్రకృతిలో రంగులను చూస్తూ ఆశ్చర్యపోతుంటాం. ఇదెలా వస్తుంది? అదెలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడకు వెళ్తుంది? అని వంద ప్రశ్నలు వేసుకొని సమాధానాలు వెతుక్కుంటాం. ప్రకృతిలో ఎన్నో వింతలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని గుర్తింపునకు నోచుకొని పర్యాటక ప్రాంతాలుగా ప్రఖ్యాతినొందుతున్నాయి. మనిషి సృష్టించిన దీప కాంతులకే సంభ్రమాశ్చరానికి గురై ముక్కున వేలేసుకుంటాం. మరి ప్రకృతి ప్రసాదించే ఈ డిస్కో లైట్లు చూస్తే ఆశ్చర్యపోవడం కాదు. అక్కడే ఉండిపోవాలనుకుంటారు. ఇది ప్రపంచంలోనే ప్రకృతి ప్రసాదించిన వింతల్లో ఒకటిగా పేరుగాంచింది. అవే అరోరా కాంతి పుంజాలు. దీన్ని నార్తరన్ లైట్స్ అని కూడా అంటారు. నీలిరంగు ఆకాశంలో మబ్బులతో పాటు నక్షత్రాలే కాదు. కళ్లకు కట్టే కాంతి రంగులుగా సాక్షాత్కరిస్తుంది. చూస్తుంటే ముందు ప్రొజెక్టర్ పెట్టి కలర్స్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆకాశంలో తీరొక్క రంగుల బల్బులు పెట్టి స్విచ్ వేసినట్టు కనిపిస్తుంది. మేఘాల్లో సమాంతరంగా వివిధ రకాల దీపాలు పరిచినట్టు ఉంటుంది. ఒక్కోసారి వాతావరణాన్ని బట్టి మబ్బులు వేగంగా కదులుతున్నప్పుడు ఈ వర్ణాలు నెమలిలా నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా అంటార్కిటికా అర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లోంచి దర్శనమిస్తాయి. వీటి మీద ఇప్పటికే చాలా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పలుమార్లు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అరోరా గురించి ఎంత వర్ణించినా తక్కువే. చూస్తే కానీ దాని మజాను ఆస్వాదించలేము.

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles