అనుగుణంగా బతికే అర్హత


Sun,March 17, 2019 01:10 AM

Raju-and-Forest
కుటుంబం అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా పట్టు తప్పక నడిపించాలంటే ముఖ్యంగా పరిస్థితుల ప్రభావం వలన తారుమారయ్యే మానవ సంబంధాలను అర్థం చేసుకోవాలి. లోకజ్ఞత, రాజనీతి, విలువలు, ఆర్థిక, సామాజిక వెసులుబాటు.. ఇవన్నీ పాలనాదక్షతకు సహకరించాలే గానీ మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోతే అన్ని తెలిసినా అక్కరకురావు. ఆంతరంగిక సమస్యలు, ప్రాపంచిక సమస్యలు బేరీజు వేస్తూ స్థాన బలం, అంగబలం, సంపాదించే సత్తాను ఇచ్చేది మన సంబంధాల ద్వారా, మానవ సంబంధాల ద్వారా వచ్చే ఆదరాభిమానాలనే విషయం తెలుసుకుంటే జీవితాన్ని ఎన్ని క్లిష్ట పరిస్థితుల నుంచైనా సునాయాసంగా నెట్టుకు రాగలమన్న దీమానిచ్చే ఈ కథ అక్షర సత్యం.

రాజ్యానికి తిరిగి వచ్చి అధికారులను గాడిలో పెట్టి రాజ్యంలో అన్యాయం, మోసం అనేదే లేకుండా చేస్తాడు సత్యపాలుడు. నెల రోజుల తర్వాత కీర్తిసేనను పెండ్లి చేసుకొని మిహిరదేశంపై దండెత్తాడు.

పూర్వం చందన దేశాన్ని పరిపాలించే చంద్రపాలునికి చాలా విశాలమైన సామ్రాజ్యంతో పాటు సత్యపాలుడనే మంచి కొడుకు ఉండేవాడు. సత్యపాలునికి యుక్తవయసు రాగానే చంద్రపాటుడు అనారోగ్యంతో మరణించాడు. అనుకోని పరి స్థితుల్లో రాజ్యభారం తనపై పడడంతో దేశపు స్థితిగతులను గమనించి ఆశ్చర్యపోయాడు. తన తండ్రి పరిపాలించినంతా అధికారులపై వదిలేసి కాలం గడిపాడని అర్థం అయింది. దానికి ప్రతిఫలంగా రాజ్యమంతా మోసపూరిత బుద్ధి ప్రబలి ప్రజలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. రాజ్యంలోని పరిస్థితులే చాలా అస్తవ్యస్తంగా ఉండగా, సామంత దేశాల రాజులు అరాచక పరిస్థితులను అవకాశంగా తీసుకొని దండయాత్రకు పాల్పడుతున్నారనే వార్తలు వచ్చాయి.

సత్యపాలునికి ఎటు చూసినా చిక్కుముడులే. ఏది ఎలా ఎప్పుడు విప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో నమ్మకస్తులైన మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం ఏదైన ఉందో సలహా ఇవ్వమని అడిగితే, మంత్రుల్లో పెద్దవాడైన సుదర్శనుడు ఆంతరంగిక సమస్యలు మనం సుతారంగా పరిష్కరించుకోవచ్చు. సామంత రాజులను యుద్ధానికి రాకుండా ఆపాలంటే ఒక్కటే ఉపాయం అని అంటాడు. ఏమిటని ప్రశ్నించిన రాజుకు వివరిస్తూ ప్రస్తుతం కోయదేశానికి చెందిన రాజు జయసేనుడు,మిహిరదేశ రాజు ప్రచండవర్మలతో ముప్పు ఉంది కనుక, మిహరదేశ రాజు కూతురైన మధులికను మీరు పెండ్లి చేసుకుంటే మన రాజ్య బలం పెరుగుతుంది. దాంతో కోయదేశపు రాజు వెనక్కి తగ్గుతాడు. వియ్యంతో కయ్యా న్ని ఆపవచ్చని సుదర్శనుడు చెబుతాడు.
సత్యపాలుడు మిహరదేశ రాజకుమార్తె అహంకారం తెలుసుకున్నవాడు గనుక మంత్రి సలహాకు నవ్వుకొని సమావేశం ముగించాడు. మరుసటి రోజు సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే ఆలోచనతో ఒంటరిగా అడవిలోని ఆశ్రమంలో తనకు చదువు నేర్పిన గురువు దగ్గరకి వెళ్ళాడు. దారిలో ఒక చిరుత సత్యపాలుని గుర్రంపై దాడి చేసింది. సత్యపాలుడు ఎంతగా ప్రయత్నించినా చిరుతను అదుపు చేయలేకపోయాడు. అంతలో ఒక విచిత్రమైన ధ్వని వినిపించింది. అది విన్న చిరుత పొదల్లోకి పారిపోయింది. మారు వేషంలో ఉన్న ఒక వ్యక్తి రాజు సత్యపాలుని చేరి మీరేమీ దిగులు పడాల్సిన పనిలేదనీ,గుర్రానికి చికిత్స చేసి, పండ్లు, నీరు రాజుకిచ్చి వెళ్ళి పోతుండగా రాజు ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఆ వ్యక్తి అది నా కర్తవ్యమని అనగానే దిగులు పడుతూ ఉన్న సత్యపాలుడు మౌనంగా ఉండిపోతాడు.

సత్యపాలుని దిగులుని గమనించి కోయదేశపు యువరాణి తన నిజ స్వరూపంతో తాను కీర్తి సేననని విషయం మీకు తెలిసిపోయిందని, మా చక్రవర్తైన మీకు సేవ చేసుకోవడం మా అదృష్టమని అంటుంది. పైగా సత్యపాలుని అడవిలోని దేవత దగ్గరకి తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా సమస్యలన్నీ దూరం అవ్వాలని వేడుకోమని అంటుంది కీర్తిసేన. సత్యపాలుడు దేవతకు సమస్కరించి, కీర్తిసేనతో సరిగ్గా నెల తర్వాత ఇక్కడే కలుసుకుంటానని చెప్పి రాజ్యానికి తిరిగి వెళతాడు సత్యపాలుడు.
రాజ్యానికి తిరిగి వచ్చి అధికారులను గాడిలో పెట్టి రాజ్యంలో అన్యాయం, మోసం అనేదే లేకుండా చేస్తాడు సత్యపాలుడు. నెల రోజుల తర్వాత కీర్తిసేనను పెండ్లి చేసుకొని మిహిరదేశంపై దండెత్తాడు. ప్రచండ వర్మ సంధికి వచ్చి సామంత రాజుగా ఉండడానికి సిద్ధపడ్డాడు. సమస్యలన్నీ సర్దుకున్నాయి. మంత్రి సలహాప్రకారం నీచుల్ని అడిగి అవుననిపించుకోకుండా ఉత్తములైన కోయదేశపువారిని అడిగి లేదనిపించుకున్నా పర్వాలేదనుకొని సత్యపాలుడు రాజనీతితో, చతురతతో నెగ్గుకొచ్చి జీవితానికి అనుగుణంగా బతికే అర్హతను గొప్పగా పొందాడు.

- ఇట్టేడు అర్కనందనా దేవి

232
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles