అనంత శిఖరం


Sun,January 29, 2017 01:11 AM

ఆయన పాటలు మాటమాట కూర్చి పాటల మాలలల్లినట్లు, పదం పదం కలిపి పల్లవుల తోరణాలు కట్టినట్లుంటాయి. స్వచ్ఛ్చమైన అచ్చతెలుగు పాటలెన్నింటికో ఆయన కలం జీవం పోసింది. ప్రతీ పాటలోనూ భాష, భావుకత్వం, శబ్ధ సౌందర్యం కలగలిపి వినసొంపుగా, మనసుకు, చెవులకు ఇంపుగా ఉండి హృదయాన్ని తాకుతాయి. తేట తెలుగు పదాలను అచ్చుపోసినట్లు, చక్కని, చిక్కని భావాలను చెక్కినట్లుండే పాటలెన్నింటికో ప్రాణం పోసినవాడు. అన్ని వర్గాలవారికి నచ్చే రీతిలో పాటలల్లడంలో ఆయనకాయనే సాటి. చిన్నవయస్సులోనే ఎంతో కీర్తిని సొంతం చేసుకుని పాటల పూదోటలో విరబూసి సినీ వినీలాకాశంలో విజయవిహారం చేస్తున్నాడు .అనంత శ్రీరామ్.ఓపడుచు బంగారమా పలకవే సరిగమ
చిలిపి శృంగారమ చిలకవే మధురిమ
ఇష్టసఖిని బంగారంతో పోల్చడం పరిపాటి. అలాంటి బంగారాన్ని సరిగమలు పలకమని, చిలిపి శృంగారాన్ని ఒలికే చెలి మధురిమలు చిలకాలంటాడు ప్రియుడు. నీ యవ్వనాన్ని చూసి మనసులోని సరదా కూడా పిలుస్తోంది అని కూడా అంటాడు. అందరివాడు చిత్రంలోని ఈ పాట అనంత శ్రీరామ్‌ను అందనంత ఎత్తులో నిలిపింది. పదాల పొందికలో ఆయన చూపిన ఒరవడి పాటల పూదోటలో తక్కువ కాలంలోనే ఏపుగా ఎదిగే అవకాశాన్ని ఆయనకు కల్పించింది. చిన్నతనం నుంచి కవితలు రాసే అలవాటే తనను పాటలు రాసేలా తీర్చిదిద్దాయంటాడు అనంత శ్రీరామ్. మరోవైపు ఆయన తండ్రికి కళల పట్ల ఆసక్తి ఉండడం, రసధుని అనే సంస్థకు గౌరవాధ్యక్షుడిగా ఉండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా అనంత శ్రీరామ్‌కు ఈ రంగం పట్ల ఆసక్తిని పెంచాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దొడ్డిపట్ల అనే గ్రామంలో ఏప్రిల్ 8, 1984లో జన్మించారు. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. 12 ఏళ్ల వయస్సులో పాటలు రాయడం ప్రారంభించిన అనంత్ శ్రీరామ్ కాదంటే ఔననిలేతో తొలిసారి సినిమా పాటల రచయితగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఒక ఊరిలో, ఏవండోయ్ శ్రీవారు చిత్రాలకు పాటలు రాశారు. ఈ మూడు సినిమాలకు మొత్తం పాటలు శ్రీరామే రాశాడు. కానీ ఆ తర్వాత రాసిన అందరివాడు లోని ఓ పడుచు బంగారమా పాట ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత రాసిన అనేక పాటలు కీర్తిశిఖరాలనధిరోహించేలా చేశాయి.

AnanthSriramయమదొంగ కోసం తొలుత ఒకే పాట అనుకున్నప్పటికీ ఏకంగా ఐదు పాటలు రాసే అవకాశం ఆయనకు దక్కింది. ఇందులో..రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే పాట కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇంకా ఇందులోనే నూనూగు మీసాలోడు, నాచోరే నాచోరే నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటా పాటలు కూడా శ్రీరాం రాసినవే. మరింత చెప్పుకోవలసిన పాట.. యంగ్ యమా యంగ్ యమా పాట. జూనియర్ ఎన్టీఆర్ చిన్న యముడు. అందుకే యంగ్ యమా అంటూ రాసేశానంటాడు అనంతశ్రీరామ్.బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో పాటలు కడుపు నింపవు అంటూ తక్కువ చేసి మాట్లడడంతో ఎలా నింపవో నిరూపించి చూపిస్తా అని మూడో సంవత్సరం మధ్యలోనే కాలేజీ మానేసి బైటికొచ్చాడు అనంత శ్రీరామ్. ఆ కసితో రాశాడు కనుకే ఆయన పాటలకు ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుసగా స్టాలిన్, పరుగు, ఆకాశమంత, మున్నా, మిస్టర్ పర్‌ఫెక్ట్, రామరామ కృష్ణకృష్ణ, బృందావనం, చందమామ, కొత్తబంగారులోకం, సత్యమేవజయతే, అరుంధతి, ఏ మాయ చేశావే ఇలా ఎన్నో సినిమాలు ఆయన ఖాతాలో పడ్డాయి. పరుగు చిత్రంలో అనంతశ్రీరామ్ రాసిన పాటలన్నీ కూడా అలరించేవే.ఎన్నెన్నెన్నెన్నో ఊహలె గుండెల్లో వున్నాయీ.. నిన్నే వూరించాలని అన్నాయితో పాటునమ్మవేమోగాని.. అందాల యువరాణినేలపై వాలింది.. నా ముందే మెరిసిందినిలకడలేని యువకునికి తొలిచూపులోనే నచ్చిన అమ్మాయి. తనను తను మరిచిపోయేలా చేసి ప్రేమించేలా చేసే గీతం.నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూమరో యుగలగీతం.

నిజంగా నేనేనా.. ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా .. ఎన్నో వింతలు చుస్తున్నా.. కొత్తబంగారు లోకం చిత్రంలోని ఈ పాట ఎందరో మనసుల్లో నాటుకున్న పాట. ఎన్నో సెల్‌ఫోన్లలో రింగుమన్న గీతం. ఈ పాటని చాలామంది సిరివెన్నెల రాశారనుకున్నారట. కానీ అనంత శ్రీరామ్‌లోని భావుకత్వాన్ని చాటిన గీతమిది.ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలోని పాటల్లో సాహిత్య శిఖరాలకి, భావుకత్వం లోతుల్లోకి వెళ్లే అవకాశం దొరికింది అంటారాయన. అంకెలింక ఉన్నన్నాళ్లు నీ వయసు సంఖ్యై ఉంటా- సంఖ్యలన్ని బంధిస్తుంటా వంద ఏళ్లుగా వంటి వాక్యాలు లోతైన భావాన్ని వ్యక్తీకరిస్తాయి.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం అనంత శ్రీరామ్ రాసిన టైటిల్ సాంగ్వేకువలోన గోదారి ఎరుపెక్కిందిఆ ఎరుపేమో గోదారి పంటయ్యింది.పండిన చేతికెన్నో సిగ్గులొచ్చిఅంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టెమో విరగబూసింది అంటూ సాగే పాట తెలుగుతనపు తియ్యదనాన్నంత కలబోసిన పాట. ఈ పాటంటే ఆయనకు ఎంతో ఇష్టం కూడా.సరైనోడు చిత్రం కోసం రాసిన యు ఆర్ మై ఎమ్మెల్యే పాటకోసం తను సోషల్ మీడియాపై ఆధారపడ్డానంటాడు అనంత శ్రీరామ్. ఈ సోషల్ మీడియా యుగంలో సంక్షిప్త పదాలకు అర్థాలున్నాయని, యు ఆర్ మై యాంజిల్ అనేది ఎమ్మెల్యేకు విస్తృతార్థం అంటారాయన. సినిమాలకు పాటలు రాయడమే కాకుండా గత ఏడాది తోటి కళకారులతో కలసి ది షేక్ గ్రూప్ పేరుతో బ్యాండ్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుద్వారా తొలిసారి ఆగస్టు 15న సలాం ఇండియా అనే పాటను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఇలా ప్రతి రెండు నెలలకు ఒక పాటను రిలీజ్ చేయాలని ఈ బ్యాండ్ నిర్ణయించింది. తక్కువ సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న పాటల రచయిత అనంతశ్రీరామ్ ఇప్పటి వరకు సుమారు 600 వరకు పాటలు రాశారు. ఈ పాటలన్నీ కూడా దేనికవే డిఫరెంట్‌గా ఉండి అలరించాయి.

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎప్పుడు కలగన్నానో, ఎక్కడ మనసిచ్చానో తెలియదు, కలవో అలవో నా మనసున వేసిన వలవో తెలియదు. కానీ నా మనసైతే ఇచ్చేశా. అసలు నీవు ఉన్నావో లేవో తెలియదు. కానీ నీ ఊసులు మాత్రం కలలో కథలా మెదులుతున్నాయంటూ తన కలలోని ప్రేయసిని తలచుకుని పాడే ఈ పాట బొమ్మరిల్లు చిత్రం కోసం శ్రీరామ్ రాసిన అద్భుతగీతం. యువతను ఎంతో ఆకట్టుకున్న పాట.
సాహాసం శ్వాసగా సాగిపో చిత్రానికి అనంత శ్రీరామ్ రాసిన తానూ నేనూ మెలోడి పాట ఎంతోమందికి ఇష్టమైన పాట. పాటలో ప్లూట్, వయోలిన్లతో హాయిగా వినిపించే ఈ గీతం విన్నవారికి వీనులవిందే. వాస్తవానికి ఇది భారతి దాసన్ అనే తమిళ కవి రాసిన కవిత ఇది. దీనికి అనంత్ శ్రీరామ్ తెలుగు సాహిత్యాన్ని అందించి మరింత మెరుగులు దిద్దాడు.
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను.. అంటూ సాగే ఈ పాటలో చాలా చక్కని పదాలు వాడడం అనంత్ శ్రీరామ్‌కే చెల్లింది. ఇందులోని భావాలు పాతగా ఉన్న కొత్త మెరుపులు కనిపిస్తాయి. తేలిగ్గా అర్థమయ్యే భావాలు పలికించిన తీరు ఆకట్టుకునేలా ఉంటుంది.
బాహుబలి చిత్రం కథాపరంగా ఎంతటి విజయం సాధించిందో పాటల పరంగానూ అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా పాట అనంత శ్రీరాం రాసిందే. అందులో చేయి నీ చేతిలో చేరగా.. రెక్కవిప్పింది నా తొందర అనే వాక్యానికి తోడు హీరో, హీరోయిన్ల చేతులపై ఉన్న టాటూలు కలిసినప్పుడు ఒక పక్షి బొమ్మ ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఆ భావన నుంచి పుట్టిందే ఈ పాట. ఈ పాట రాయడానికి ఆయనకు 75 రోజుల పట్టిందట.

మరికొన్ని ఆణిముత్యాలు


స్టాలిన్ : పరారె పరారె
పరుగు : నమ్మవేమోగానీ..
అరుంధతి : చందమామ నువ్వే నువ్వే
డార్లింగ్ : ఇంకా ఏదో.. ఇంకా ఏదో..
మర్యాద రామన్న : తెలుగమ్మాయి
ఊసరవెళ్లి : నిహారికా నిహారికా
ఏం మాయ చేసావె : కుందనపు బొమ్మ
అలా మొదలైంది : అమ్మమ్మో అమ్మో
మిస్టర్ ఫర్‌ఫెక్ ్ట: చలిచలిగా అల్లింది.
లైప్ ఈజ్ బ్యూటిపుల్ : అటు ఇటు ఊగుతూ

4281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles