అతడు


Sun,September 10, 2017 01:56 AM

విూ సోటోళ్ళందరు కాళ్ళకు సక్కదనంగ సెప్పులు తొడుక్కుంటుంటె గదానికి నోసుకోని నాకు సంబరమైద్ది చేతులతో అపురూపంగా వేళ్ళలేని పాదాలను నిమురుకున్నాడు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చీకటి చిక్కబడ్తోంది.గాలి విసురు ఎక్కువైంది. వుండీవుండీ చినుకులు సూదుల్లా తాకుతూ నాకన్నీటి చుక్కలను తనలో కల్పుకున్నాయి. ప్రాణం లేని మందు రోగి ప్రాణాన్ని కాపాడినట్టు సగం పాదంతో అందరి పాదాలకు రక్షణనిస్తున్న అతడికి చేతులెత్తి నమస్కరించాను. ఈ లోకంలో ప్రతి మనిషీ ఒక కథలో జీవిస్తాడు. ఆ కథ అతడినోటి వెంటే వినాలి. అప్పుడే మనం కూడా అనుభవించగల్గుతాం.బాబూ! అర్జెంట్‌గా ఈ చెప్పు కుట్టివ్వు హడావిడిగా స్కూటర్ దిగి కాలికున్న చెప్పు విడిచి అక్కడ పరిచివున్న బస్తాబొంతలో పెట్టాడో బాటసారి.చెప్పులు కుట్టేతను వొంచిన తల ఎత్తకుండా అప్పటికే కుడ్తున్న నా పాదరక్షను అటూ, ఇటూ తిప్పుతూ, మరోసారి బలంగా చేతితో లాగుతూ అందులోనే నిమగ్నమైపోయాడు.
బాబూ, నాకు అర్జెంట్‌గా వెళ్ళే పని వుంది. ముందిది కుట్టు అంటూ అతడి దగ్గరగా జరిపాడా చెప్పును.కానీ, అతడిలో ఉలుకూ, పలుకూ లేదు. తన పనిలోనే మగ్నమైవున్నాడు. ఆ కుట్టేతని పక్కన గద్దెమీద కూర్చున్న నన్నుచూసి ఆ బాటసారి చెవుడా ఇతనికి అన్నట్టు సంజ్ఞ చేశాడు.ఏమో..? అన్నట్టు నేను నా చేతిని తారంగం తిప్పాను. ఇంకా డబ్బులు కూడా ఎక్కువ ఇస్తా బాబూ. ప్లీజ్ తొందరగా కుట్టివ్వవా? మళ్ళీ అర్ధింపు లాంటి అతడి అభ్యర్ధన. కనీసం తలకూడా పైకెత్తని అతడ్నిచూసి ఆ బాటసారి గబగబా జేబులోనుండి 100 రూ॥ నోటుని తీసి అతడి ముందు పెట్టాడు. కాని అతడు తన పనికి అడ్డు వస్తున్న ఆ కాగితాన్ని కూడా పక్కకి జరుపుతూ పని సాగించాడు. చేసేది లేక, అక్కడక్కడ ఏ చెప్పులు కుట్టేవాడు కనబడక నిట్టూరుస్తూ నిలబడ్డాడా బాటసారి.ఎంతివ్వాలి? అని అడిగాను.
Katha

తన చేతి పదివేళ్ళు చూపించాడు. జేబంతా తడిమితే పదిరూపాయల కాగితానికి బదులు ఇరవై, యాభై చేతి కొస్తుంటే మళ్ళీ వాటిని జేబులో కుక్కుకొని చిల్లర కోసం పర్సంతా శోధించి పదిరూపాయల చిల్లరంతా అతడి ముందు కుప్పబోసి వెళ్ళడానికి లేచాను. అతను తన ముందు అప్పటికే పెట్టివున్న బాటసారి చెప్పును దగ్గరికి లాక్కుని మళ్ళీ తపస్సు చేస్తున్నంత ఏకాగ్రతలో కుట్లు వేయడం మొదలు పెట్టాడు.మనిషికీ, తాను చేస్తున్న వృత్తికీ ప్రాదమిక భందం వుంటుంది. అందువల్ల ఆ బంధంపై మమకారం పెరగడం సహజం. కొందరు మాత్రమే ఆ వృత్తిని కాపాడుకొంటూ జీవిస్తుంటారు.నిరంతరంగా రోడ్లనిండా సాగే జనప్రవాహాన్ని, హోరుమనే వాహనాల శబ్దాన్ని, పట్టించుకోక సగం నీడను మాత్ర మేయిస్తున్న చెట్టుకింద కూర్చొని ఎండా, వానలను లెక్కచేయక ఏకాగ్రతతో తపస్సులా పనిచేస్తున్న అతడిని చూసినప్పుడు, బతకడమంటే కళ్లతో చూడడం, కాళ్లతో నడవడం, కడుపునిండా తినడం మాత్రమే కాదు కనురెప్పలా వృత్తిని కాపాడుకుంటూ అందులో మమేకమై పోవడం అని అర్దమైంది.పనితనం బాగుంది. పైసలు కూడా తక్కువే అతడికి చెవులు విన్పించవనే నిర్ణయంతో పెద్దగా అన్నాను. నా సంతోషానికి రెండు కారణాలు. పదిరూపాయల చిల్లర దొరికి అతడికి ఎక్కువ ఇవ్వనందుకు. కొత్త చెప్పుల ఖర్చు మరో కొన్ని రోజుల వరకు వాయిదా పడినందుకు.

ఇదంతా చూస్నున్న ఆ బాటసారి కూడా తనంతకు ముందు అతడి దగ్గర పెట్టిన వంద రూపాయల నోటు జేబులో పెట్టుకుని, పది రూపాయల కాగితం వెతుక్కుని రెడీగా వుంచుకున్నాడు. అంతేకాకుండా దీనిక్కూడా ఓ రెండు కుట్లెయ్యవా? అంటూ రెండో కాలిది కూడా అతని ముందు పెట్టాడు. అతడు దాన్నికూడా శ్రద్ధగా కుట్టాడు. కొత్త చెప్పుల్లావున్న రెండింటినీ కాళ్ళకు వేసుకుని పది రూపాయలనోటు అతడి చేతిలో పెట్టాడు. అతడా కాగితాన్ని చూసుకుని తృప్తిగా తలాడిస్తూ తన పాదాల మీద వేసుకున్న బట్టకింద దూర్చాడు. ఎందుకో ఇంటికి వెళ్ళాక ఏ పని చేస్నున్నా అతడి రూపమే కన్పించి జాలి కల్గించింది. నేను రోజూ అక్కడి నుండే ఆఫీసుకు వెళ్ళేది. వస్తూ, పోతూ అక్కడ కాసేపాగి అతడ్ని చూసి వెళ్ళడం నాకు పరిపాటి అయింది. రోజూ క్రమం తప్పకుండా జరిగే విషయాలకు ఒక గుణం వుంటుంది. అవి మనం గమనించక పోయినా మనకు తెలియకుండానే అవి మన మనసులో ముద్ర వేసుకుంటాయి. ఏదో ఒకరోజు ఆ క్రమం తప్పినపుడు ఏదో వెలితిగా వుంటుంది.నాకు తెలియకుండానే ఆ మనిషిని గురించే మనసు ఆరాటపడ్తోంది. ఒకరోజు ఆ మనిషి కనబడక పోయేసరికి ఏదో పోగొట్టుకున్న అనుభూతి కల్గింది. రెండురోజుల తర్వాత మళ్ళీ అతడి స్థానంలో కనడ్డాడు. అమ్మయ్య అంటూ వూపిరి పీల్చుకున్నాను.అతడిని ఏదో అడగాలని అన్పించింది. ఏది అడుగుదామనుకున్నా అతడికి మాటలు రావు. తలొంచి పనిలో దూరాడంటే దేవుడు ప్రత్యక్షమైనా తల పైకెత్తడు అనుకుంటూనే అతడి కేసి నడిచాను.

ఇంతలో ఓ కారులో నుండి దిగిన నడివయస్కురాలు ఆమె కాలికి వేసుకున్న ఖరీదైన షూలాంటి దాన్ని అతడి ముందు పెట్టింది. దాన్నంతా తడిమి తడిమి చూస్తూ బావుందన్నట్టు బొమ్మలెగరేస్తూ కుట్టడం మొదలుపెట్టాడు. ఆమె పర్సునుండి పది రూపాయలు తీసి ఇచ్చింది. అతడు ఎప్పటిలాగే బస్తాకిందికి పెట్టాడు. ఆమె అలాగే నిల్చొని దీనికే పది రూపాయలా? చిల్లరలేక ఇచ్చానంది. అతడు తప్పు చేసినట్టు గబగబా రెండు రూపాయల చిల్లర ఆమె చేతికిచ్చాడు. ఆమె తృప్తి చెందినట్టు అన్పించక ఏదో గొణుక్కుంటూ వెళ్ళి కారెక్కింది.నువ్విలా అడిగే కొద్దీ తగ్గిస్తే ఆరిపోతావ్? నాలో నేనే గొణుక్కున్నట్టు అన్నాను. ఆ మాట కతడు మొదటిసారి నవ్వాడు.ముసలోన్ని. నన్నెవలు మోసం సేత్తరు నాయ్నా. పని కొద్దిదే. గందుకే గా యవ్వ.. తప్పు తనదే అన్నట్టు నిట్దూర్పుతో నవ్వాడు.

నాకు పని పక్కాగ సెయ్యకుంట పైసల్దీసుకుంటే అయ్యాల అన్నం సయించదు. మీ పైస కిలువుండాలె. నా పనికి ఇలువుండాలె. మాటలల్లబడితే పని ఖరాబు. గందుకే పనిసేసిన్దాంక ఎవ్వరితో మాట్లాడ. నీ తీర్గనె ఈడికొచ్చినోళ్ళందరు నన్ను సెవిటోడనుకుంటరు. మూగోడనుకుంటరు. గట్టనుకుంటె నాదేం పోద్ది. పైసల్దీస్కోని పని మంచిగ సెయ్యలేదనుకోకుంటె నాకు సాలు. అంటూ ఆ రోజు వచ్చిన డబ్బులు లెక్కబెట్టడానికన్నట్టు కాళ్ళమీద గప్పిన బట్టతీసేసి పక్కకి జరిగాడు. నా కళ్ళు బైర్లు కమ్మాయి.
ఇంకా అతడు ఏదో అంటున్నాడు.మీ అసొంటోళ్ళందరు కాళ్ళకు సక్కదనంగ సెప్పులు తొడుక్కుంటుంటె గదానికి నోసుకోని నాకు సంబరమైద్ది చేతులతో అపురూపంగా వేళ్ళులేని పాదాలను నిమురుకున్నాడు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.చీకటి చిక్కబడ్తోంది. గాలి విసురు ఎక్కువైంది. వుండీ వుండీ చినుకులు సూదుల్లా తాకుతూ నా కన్నీటి చుక్కలను తనలో కల్పుకున్నాయి.ప్రాణం లేని మందు రోగి ప్రాణాన్ని కాపాడినట్టు సగం పాదంతో అందరి పాదాలకు రక్షణనిస్తున్నఅతడికి చేతులెత్తి నమస్కరించాను.

ఈ లోకంలో ప్రతి మనిషీ ఒక కథలో జీవిస్తాడు. ఆ కథ అతడి నోటి వెంటే వినాలి. అప్పుడే మనం కూడా అనుభవించగల్గుతాం.అతడి కథ మనసును స్పందింపజేసే దయనీయమైన కథ. అతడి నోటి వెంట వెళ్ళిన నాలుగు మాటలు పురాణాలలో, వేదాలలో కూడా కానరాని నీతిమాటలు. అతడు మూగవాడిలా, చెవిటి వాడిలా కన్పిస్తూ అవిటి వాడిలా జీవితం గడుపుతున్నా అతని మాలిన్యం లేని గొప్పమనసుకు నాలాంటి వాళ్ళు కక్కుర్తి పడుతూ ఇచ్చే పది రూపాయల నోట్లు అతని ముందు తలవంచి మస్కరిస్తున్నట్టనిపించింది.

1455
Tags

More News

VIRAL NEWS