పంత్‌కు యువీ మద్దతు


Fri,July 12, 2019 02:57 AM

న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవడంపై రిషబ్ పంత్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ కూడా పంత్ షాట్ ఎంపికను ట్విట్టర్ వేదికగా తప్పుబట్టాడు. ఎన్నోసార్లు పంత్ తప్పుడు షాట్లకు ప్రయత్నించి ఔటయ్యాడని, ఇది బాధాకరమని అన్నాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. అతడు (రిషబ్ పంత్) కేవలం 8 అంతర్జాతీయ వన్డేలే ఆడాడు. అతడి తప్పేం లేదు. కచ్చితంగా నేర్చుకుని మరింత మెరుగుపడతాడు అని యువరాజ్ అన్నాడు.

264

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles