ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడితే బాగుండేది


Wed,July 10, 2019 02:46 AM

Yuvraj-Singh
కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో అనితర సాధ్యమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్న భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌..ఐపీఎల్‌ కెరీర్‌పై మాత్రం పెదవి విరిచాడు. మంగళవారం భారత చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 91వ వార్షిక సాధారణ సమావేశాల్లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్న సందర్భంగా యువీ మాట్లాడాడు. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున స్థిరంగా ఉండలేకపోవడం నిరాశ కలిగించిందని చెప్పాడు. ‘నేను ఆ విషయాన్ని వివరించి చెప్పలేను. కానీ ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడలేకపోయా. ఒకటి లేదా రెండు జట్ల తరఫునే ఆడి ఉంటే బాగుండేది. 2016 వేలం లో దాదాపు కోల్‌కతాతో జతకలుస్తానని అనుకున్నా. కానీ ఆర్సీబీకి వెళ్లా. అదే నా అత్యుత్తమ ఐపీఎల్‌ సీజన్‌' అని యువీ అన్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో పంజాబ్‌, పుణె, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌, ముంబై జట్ల తరఫున యువీ ఆడాడు.

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles