అభినందన్‌ను కించపరిచేలా..


Wed,June 12, 2019 12:44 AM

Abhinandan
వీడియో రూపొందించిన పాక్ చానల్

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎన్నో భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఇరు దేశాల ఆటగాళ్లు, ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇక ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ సందర్భంగా టీవీల్లో అనేక ప్రత్యేక ప్రకటనలు కనిపిస్తాయి. ఈనెల 16న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన వీడియో దాయాది నైజాన్ని బయటపెట్టింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ కనబరిచిన పరాక్రమాన్ని తక్కువ చేసి చూపించింది. పాక్ సైన్యానికి పట్టుబడిన తర్వాత అక్కడి అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం వెరవకుండా గుండె నిబ్బరంతో అభినందన్ సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వీడియోను అనుసరిస్తూ పాక్‌కు చెందిన జాజ్ అనే చానల్ ఒక ప్రకటన రూపొందించింది. ఇందులో వర్ధమాన్‌ను పోలి ఉండే వ్యక్తి అదే రకమైన మీసకట్టుతో టీమ్‌ఇండియా జెర్సీ వేసుకుని చాయ్ తాగుతూ ఉంటాడు. టాస్ గెలిస్తే టీమ్‌ఇండియా అనుసరించే వ్యూహాలేంటి అన్న ప్రశ్నకు స్పందిస్తూ క్షమించండి..నేను ఆ విషయాలు చెప్పకూడదు అని సమాధానమిస్తాడు. ఈ ప్రకటన అభినందన్‌ను గుర్తు చేసేలా ఉన్నా..సదరు వ్యక్తిని నలుపు రంగులో చూపించిన జాజ్ చానెల్ జాత్యాంహకర ధోరణిని ప్రదర్శించింది.

200

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles