జయహో భారత్


Mon,June 17, 2019 02:43 AM

-ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారీ విజయం
-రోహిత్‌శర్మ సూపర్ సెంచరీ
-అదరగొట్టిన హార్దిక్, కుల్దీప్, శంకర్

kohli-rohit
మాంచెస్టర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ అజేయ రికార్డు చెక్కుచెదరలేదు. అభిమానులు ఒళ్లంతా కండ్లు చేసుకుని చూసిన మెగాటోర్నీలో మనోళ్లు పాక్‌ను పాతరేశారు. శతకోటి భారతావని మది విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. మాతో పెట్టుకుంటే మసే అన్న రీతిలో కోహ్లీసేన చూపించిన పరాక్రమం..క్రికెట్ బతికున్నంతకాలం ప్రతిఒక్కరికి గుర్తుండిపోతుంది. బంతి బంతికి తమ శౌర్యాన్ని ప్రత్యర్థికి రుచిచూపించిన భారత్ విజయ పతాక ఎగురవేసింది. యుద్ధంలా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) పరుగులతో పాకిస్థాన్‌పై భారీ విజయం సాధించింది. తొలుత హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ (113 బంతుల్లో 140; 14ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 77, 7 ఫోర్లు), రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 336/5 భారీ స్కోరు చేసింది. పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ రాహుల్, రోహిత్ నిర్మించిన పటిష్ఠమైన ఇన్నింగ్స్‌ను కోహ్లీ మరోస్థాయికి తీసుకెళ్లాడు. హిట్‌మ్యాన్ పేరుకు సార్ధకతను చేకూరుస్తూ రోహిత్ కొట్టిన కొట్టుడుకు మాంచెస్టర్ మైదానం దద్దరిల్లిపోయింది. లక్ష్యఛేదనలో శంకర్ (2/22), హార్దిక్ (2/40), కుల్దీప్ యాదవ్ (2/32) ధాటికి పాక్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులకు పరిమితమైంది. కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి.. భారత్ చేతిలో ఏడో ఓటమి మూటగట్టుకుంది. పూర్తి వివరాలు స్పోర్ట్స్ పేజీలో

2832

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles