రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి: గోపీచంద్


Mon,May 13, 2019 02:52 AM

p-gopi-chand
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితోపాటు బ్యాడ్మింటన్ ఆటను విస్తరింపచేసేందుకు రాష్ర్ట సంఘ బాధ్యులతో పాటు ఆయా జిల్లాల వారు ఎంతగానో కృషిచేస్తున్నారని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం వరంగల్‌లో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో అశోకా హోటల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర సంఘం జనరల్‌బాడీ సమావేశంలో గోపీచంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది సంఘం ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్ల నిర్వహణ తీరును ఇందులో చర్చించడంతో పాటు ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలపై మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రమేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్, పాణీరావు, పీసీఎస్ రావు, మనోజ్‌కుమార్, శ్రీనివాస్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

170

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles