తొలి టైటిల్ వేటలో.. నేటి నుంచి మహిళల


Fri,November 9, 2018 12:47 AM

టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కివీస్‌తో భారత్ అమీతుమీ
harman
ప్రొవిడెన్స్ (గయానా): గత చరిత్ర బాగాలేకపోయినా.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో భారత యువ మహిళల జట్టు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమైంది. నేడు న్యూజిలాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో విజయకేతనం ఎగురవేయాలని కొత్త ప్రణాళికలు రచిస్తున్నది. 50 ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే ధనాధన్ క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు పెద్దగా పట్టు లేదు. కానీ ఆరుగురు యువ మహిళా క్రికెటర్లు జట్టులోకి రావడంతో బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ మరింత బలోపేతమైంది. గతంలో ఐదుసార్లు ప్రపంచకప్‌లో బరిలోకి దిగినా భారత్‌కు ఇంతవరకు టైటిల్ దక్కలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ ఫలితం 2009, 2010లో సెమీస్‌కు చేరడమే. ఎప్పుడూ పురుషుల టోర్నీతో పాటే జరిగే ఈ మెగా ఈవెంట్‌ను ఈసారి స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా-ఎపై అద్భుత విజయాలు సాధించడం కలిసొచ్చే అంశం. వామప్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై గెలువడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఓపెనింగ్‌లో హైదరాబాదీ మిథాలీ రాజ్, సృ్మతి మందన ఇచ్చే ఆరంభంపైనే స్కోరు ఆధారపడి ఉంటుంది. రొడ్రిగ్వేజ్, హర్మన్‌ప్రీత్, తాన్యా భాటియా మిడిలార్డర్ భారం మోయనున్నారు. స్పిన్‌లో పూనమ్ యాదవ్ అత్యంత కీలకం. అయితే పేస్ బౌలింగ్‌లో అనుభవలేమి టీమ్‌ఇండియాకు ప్రతికూలంగా మారింది. పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్ తర్వాత ఆ లోటును పూరించే వాళ్లు కనిపించడం లేదు. అయితే తమ బౌలర్లు గత మూడు నెలలో చాలా మెరుగయ్యారని కెప్టెన్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. మా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. గత టోర్నీతో పోలిస్తే ఫీల్డింగ్‌లోనూ 10 శాతం మెరుగుపడ్డాం. లంకపై మా విజయాలే ఇందుకు నిదర్శనం అని కౌర్ పేర్కొంది. గత మూడు టోర్నీల్లో గ్రూప్ దశను కూడా దాటలేకపోయిన టీమ్‌ఇండియా నాకౌట్‌కు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

10 జట్లు.. రెండు గ్రూప్‌లు
నేటి నుంచి మొదలయ్యే వరల్డ్‌కప్ ఈనెల 25న ముగియనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా ఆడించనున్నారు. రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-బిలో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా... గ్రూప్-ఎలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి.

భారత్ షెడ్యూల్
నవంబర్ 11 భారత్ X పాకిస్థాన్
నవంబర్ 15 భారత్ X ఐర్లాండ్
నవంబర్ 17 భారత్ X ఆస్ట్రేలియా

జట్ల వివరాలు
భారత్: హర్మన్‌ప్రీత్(కెప్టెన్), తాన్యా భాటియా, ఏక్తా బిస్త్, హేమలత, మాన్సి జోషి, వేదా కృష్ణమూర్తి, స్మృతి మందన, అనుజా పాటిల్, మిథాలీ రాజ్, అరుంధతి, రొడ్రిగ్వేజ్, దీప్తి శర్మ, పూజ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్.

న్యూజిలాండ్: అమీ సాట్టెర్త్‌వైటీ (కెప్టెన్), సుజీ బేట్స్, బెర్నాండైన్ బెజుడెన్‌హౌట్, సోఫీ డివైన్, కేట్ ఇబ్రహీం, మ్యాడీ గ్రీన్, హోలీ హడెల్‌స్టన్, హాలీ జెన్సెన్, లియాగ్ క్యాస్పరెక్, అమిలియా కెర్, క్యాటీ మార్టిన్, అన్నా పీటర్సన్, హారియెట్ రోవీ, లీ తహుహు, జెస్ వాట్కిన్.

227

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles