హర్మన్ హరికేన్


Sun,May 12, 2019 01:52 AM

- మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డ కౌర్
- మహిళల మినీ ఐపీఎల్ టైటిల్ సూపర్ నోవాస్‌దే
- ఫైనల్లో ఓడిన మిథాలీసేన


womensT20
మహిళల మినీ ఐపీఎల్ తొలి ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే.. చివరి ఓవర్‌లో సూపర్ నోవాస్‌కు 7 పరుగులు కావాలి. అప్పటికే అర్ధ సెంచరీతో జోరుమీదున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉంది. ఇంకేముంది నోవాస్ విజయం నల్లేరుపై నడకే అనిపించినా.. తొలి బంతికి పరుగు తీయలేకపోయిన హర్మన్‌ప్రీత్ రెండో బంతికి ఔటైంది. దీంతో సమీకరణం 4 బంతుల్లో 7కు చేరింది. పరిస్థితి తలకిందులైంది. అయినా తీవ్ర ఒత్తిడిలో స్థిరంగా ఆడిన రాధా యాదవ్ వరుస బంతుల్లో 2,2,2,4 కొట్టి నోవాస్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది.

జైపూర్: మహిళల టీ20 చాలెంజ్ తొలి సీజన్‌లో సూపర్ నోవాస్ విజేతగా నిలిచింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో వెలాసిటీపై విజయం సాధించింది. చివరి లీగ్ మ్యాచ్ లో మిథాలీ బృందంపై పైచేయి సాధించిన సూపర్ నోవాస్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వెలాసిటీని చిత్తు చేసింది. శనివారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెలాసిటీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. సుష్మా వర్మ (32 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అమెలియా కెర్ (36; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తహూహు 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు అర్ధసెంచరీతో చెలరేగడంతో.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆలమ్, కెర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

హర్మన్ విధ్వంసం

లక్ష్య ఛేదనలో సూపర్ నోవాస్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లో జయంగని (2) రనౌటైంది. రోడ్రిగ్స్ (22; 3 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ పునియా (31 బంతుల్లో 29; 5 ఫోర్లు) చెలరేగిపోయింది. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు కొట్టడంతో స్కోరు పరుగులు పెట్టింది. మొదట శిఖ బౌలింగ్‌లో ప్రియా 2 ఫోర్లు బాదితే.. మాథ్యూస్ ఓవర్‌లో రోడ్రిగ్స్ అదే పనిచేసింది. ఆ తర్వాత కాస్త జోరు తగ్గించిన ఈ జోడీని కెర్ విడదీసింది. ప్రియ, స్కీవర్ (2), డివైన్ (3) కూడా వెంటవెంటనే ఔటవడంతో సూపర్ నోవాస్ 64/5తో క్లిష్ట స్థితిలో నిలిచింది. విజయానికి 36 బంతు ల్లో 58 పరుగులు అవసరమైన దశలో.. 4 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ కౌర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా విరుచుకుపడింది. తహూహు (2 నాటౌట్)ను మరో ఎండ్‌కు పరిమితం చేస్తూ.. వరుస బౌండ్రీలతో రెచ్చిపోయింది. ఏక్తా ఓవర్‌లో 4,6 బాదిన కౌర్, ఆలమ్‌కు రెండు ఫోర్లు రుచి చూయించింది. దేవిక ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో 34 బంతుల్లో అర్ధ సెంచరీ కొట్టేసింది. చివరి ఓవర్‌లో విజయానికి 7 పరుగులు అవసరమైన దశలో కౌర్ ఔటైనా.. రాధా యాదవ్ (4 బంతుల్లో 10 నాటౌ ట్) మిగతా పని పూర్తిచేసింది.

ఆదుకున్న అమేలియా, సుష్మ:

వెలాసిటీ ఇన్నింగ్స్ ఆరంభానికి అంతానికి పొంతనే లేదు. తొలి ఓవర్‌లో ఒకటి, రెండో ఓవర్‌లో ఒకటి, మూడో ఓవర్‌లో ఒకటి ఇలా తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్ (0), వ్యాట్ (0), షఫాలి (11) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాటపట్టారు. ఈ దశలో మిథాలీ రాజ్ (12), వేద (8) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఐదు బంతుల వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరగడంతో.. 37/5తో వెలాసిటీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి వెలాసిటీ వంద చేసినా ఎక్కువే అనిపిస్తే.. సుష్మ వర్మ, అమెలియా కెర్ చక్కటి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో నెమ్మదిగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. అడపాదడపా బౌండ్రీలు కొట్టిన ఈ జోడీ 17 ఓవర్లకు స్కోరును 100 దాటించి జట్టుకు పోరాడే స్కోరు అందించింది.
womensT201

స్కోరు బోర్డు

వెలాసిటీ: మాథ్యూస్ (సి) భాటియా (బి) తహూహు 0, షఫాలీ (సి) పాటిల్ (బి) తహూహు 11, వ్యాట్ (స్టంప్డ్) భాటియా (బి) పాటిల్ 0, మిథాలీ (సి) డివైన్ (బి) స్కీవర్ 12, వేద (స్టంప్డ్) భాటియా (బి) డివైన్ 8, సుష్మ (నాటౌట్) 40, కెర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) పూనమ్ 36, శిఖ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 121/6. వికెట్ల పతనం: 1-0, 2-1, 3-14, 4-37, 5-37, 6-108, బౌలింగ్: తహూహు 4-1-21-2, పాటిల్ 3-0-19-1, రాధ యాదవ్ 2-0-13-0, డివైన్ 4-0-19-1, స్కీవర్ 4-1-27-1, పూనమ్ 3-0-18-1.

సూపర్ నోవాస్: ప్రియ (స్టంప్డ్) సుష్మ (బి) దేవిక 29, జయంగని (రనౌట్) 2, రోడ్రిగ్స్ (సి అండ్ బి) కెర్ 22, హర్మన్‌ప్రీత్ (సి) మాథ్యూస్ (బి) కెర్ 2, స్కీవర్ (బి) ఆలమ్ 2, డివైన్ (బి) ఆలమ్ 3, తహూహు (నాటౌట్) 2, రాధ (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 125/6. వికెట్ల పతనం: 1-9, 2-53, 3-53, 4-59, 5-64, 6-115, బౌలింగ్: శిఖ 3-0-17-0, మథ్యూస్ 2-0-17-0, ఏక్తా 3-0-20-0, ఆలమ్ 4-0-21-2, కెర్ 4-0-29-2, దేవిక 4-0-21-1.

163

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles