డోప్‌ టెస్టులో నీరజ్‌ విఫలం


Tue,December 3, 2019 01:26 AM

neeraj
న్యూఢిల్లీ : అంతర్జాతీయ టోర్నీల్లో ఇటీవల సత్తాచాటుతూ.. 2020 టోక్యో ఒలింపిక్స్‌ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న భారత మహిళా బాక్సర్‌ నీరజ్‌ (57కేజీలు) డోప్‌ టెస్టులో విఫలమైంది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు జాతీయ మాదక ద్రవ్య నిరోధక ఏజెన్సీ (నాడా) వెల్లడించింది. దీంతో నీరజ్‌పై తాత్కాలిక నిషేధం వేటు పడింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక స్ట్రాండ్జా మొమోరియల్‌ టోర్నీలో కాంస్య పతకం దక్కించుకున్న నీరజ్‌.. రష్యాలో జరిగిన ఓ టోర్నీలో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆమె నుంచి సెప్టెంబర్‌ 24న సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా.. నిషిద్ధ ఉత్ప్రేరకాలు లింగాన్‌డ్రోల్‌తో పాటు మరిన్ని అనాబోలిక్‌ స్టెరాయిడ్స్‌ తీసుకున్నట్టు వెల్లడైందని నాడా ప్రకటించింది. ఈ సమాచారం తమకు వారం క్రితమే తెలిసిందని, ప్రస్తుత చర్యగా జాతీయ క్యాంపు నుంచి నీరజ్‌ను పంపించి వేశామని భారత బాక్సింగ్‌ సమాఖ్య తెలిపింది.

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles