చరిత్రకు అడుగు దూరంలో..


Sun,July 16, 2017 02:33 AM

నేడు సిలిచ్‌తో ఫెదరర్ ఫైనల్ పోరు
ఎనిమిదో టైటిల్ కోసం స్విస్ స్టార్ వేట

federer
లండన్: ప్రపంచ టెన్నిస్‌కు ఓల్డ్ వెటరన్‌గా మారిన రోజర్ ఫెదరర్.. వింబుల్డన్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. అనుభవం, ఆటతీరులో తనకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో నేడు అమీతుమీ తేల్చుకోనున్నాడు. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఈ స్విస్ స్టార్ కెరీర్‌లో 8వ వింబుల్డన్ టైటిల్‌ను సా ధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నా డు. ఒకవేళ ఫ్రెడ్డీ ఈ మ్యాచ్‌లో నెగ్గితే.. ఏడు టైటిల్స్ గెలిచిన పీట్ సంప్రాస్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు ఓపెన్ ఎరాలో ఓల్డెస్ట్ (పెద్ద వయస్కుడిగా) చాంపియన్‌గా అవతరిస్తాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోని ఫెదరర్.. దిమిత్రోవ్, రావోనిక్, బెర్డిచ్‌లాంటి యువ సంచలనాలను దాటుకుని 11వసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. గతంలో మరో నలుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. 2012లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన ఫెదరర్ 2013, 14లో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. మరోవైపు క్వార్టర్, సెమీస్‌లో ముల్లర్, క్వెర్రీ నుంచి గట్టిపోటీ తట్టుకుని నిలబడ్డ సిలిచ్ సంచలనంపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు.
cilic
అయితే ముఖాముఖి రికార్డులో 1-6తో వెనుకబడ్డ క్రొయేషియన్.. ఫెదరర్ టైటిల్‌ను అడ్డుకుంటే గొప్ప ఘనతే. ఎందుకంటే స్విస్ ప్లేయర్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన సర్వీస్‌లు, బలమైన విన్నర్లు, బేస్‌లైన్ గేమ్‌తో అదరగొడుతున్నాడు. గతేడాది ఇదే టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో ఫెదరర్‌కు ముచ్చెమటలు పట్టించిన సిలిచ్ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. 2014 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో ఫెదరర్‌పై నెగ్గిన సిలిచ్.. ఏకంగా టైటిల్‌ను కొట్టేశాడు. దీంతో కెరీర్‌లో గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్ గెలిచే సువర్ణావకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక మాజీలు, అభిమానులు మాత్రం ఫెదరర్ నాలుగు సెట్లలో నెగ్గుతాడని అంచనాలు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం!

367

More News

VIRAL NEWS

Featured Articles