విలియమ్సన్ సెంచరీలు


Wed,December 4, 2019 02:10 AM

-న్యూజిలాండ్, ఇంగ్లండ్ రెండో టెస్టు ‘డ్రా’
kane-williamson
హామిల్టన్: కెప్టెన్ కేన్ విలియమ్సన్ (104 నాటౌట్), సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ (105 నాటౌట్) అజేయ సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టును న్యూజిలాండ్ ‘డ్రా’ చేసుకుంది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 1-0తో చేజిక్కించుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 96/2తో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్‌ను విలియమ్సన్, ముందుకు నడిపించారు. ఇంగ్లండ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా కివీస్‌కు కలిసొచ్చాయి. కేన్ ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లిష్ ఫీల్డర్లు ఒకటికి మూడుసార్లు వదిలేశారు. మిడ్‌వికెట్‌పై డెన్లీ వదిలేసిన క్యాచ్ అయితే మరీ హాస్యాస్పదం. నేరుగా వచ్చి చేతిలో పడ్డ లడ్డూలాంటి క్యాచ్‌ను డెన్లీ నేలపాలు చేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న సారథి టెస్టు కెరీర్‌లో 21వ శతకం పూర్తి చేసుకుంటే.. 19వ సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. లంచ్ తర్వాత జట్టు స్కోరు 241/2తో ఉన్న సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను ని ‘డ్రా’గా ప్రకటించారు. డబుల్ సెంచరీ హీరో రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, వాగ్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Ross-Taylor

344

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles