ప్రభుత్వం వద్దంటే ఆడం


Sat,February 23, 2019 12:32 AM

Ravi-Shastri
ముంబై: ప్రభుత్వం వద్దంటే.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటామని భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం శిరోధార్యమన్నాడు. ఈ విషయంపై ఏం జరుగుతుందనేది మాకంటే బీసీసీఐ, ప్రభుత్వానికే ఎక్కువగా తెలుసు. దీనిపై తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటారు. ఈ అంశంలో మేం చేసేదేమీ లేదు. వాళ్ల నిర్ణయం ప్రకారమే మేం నడుచుకోవాలి. ఒకవేళ ఈ అంశం సున్నితమైంది. మీరు ప్రపంచకప్ ఆడొద్దని మా ప్రభుత్వం చెబితే మొత్తం టోర్నీనే రద్దు చేసుకుంటాం అని శాస్త్రి పేర్కొన్నాడు. ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తుండటంతో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతున్నది. మరోవైపు పుల్వామా దాడి నేపథ్యంలో బీసీసీఐ.. ఐసీసీకి ఓ లేఖ రాసింది. మెగా ఈవెంట్‌లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల భద్రత విషయంపై తాము ఆందోళన చెందుతామని పేర్కొంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలతో క్రికెట్ మ్యాచ్ జరుగకుండా చూడాలని కోరింది. అలాంటి దేశాలను ఐసీసీ నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేసింది.

438

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles