విండీస్ కోచ్ పైబస్‌పై వేటు


Sat,April 13, 2019 02:07 AM

-తాత్కాలిక కోచ్‌గా ఫ్లాయిడ్ రీఫెర్
RICHARDPYBUS
అంటిగ్వా (గుటెమాల): ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌నకు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) అనూహ్య నిర్ణయాలు తీసుకున్నది. వివాదాస్పద వ్యవహారశైలి కలిగిన జాతీయ జట్టు కోచ్ రిచర్డ్ పైబస్‌పై వేటు వేసింది. అతని స్థానంలో ఫ్లాయిడ్ రీఫెర్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించింది. వరల్డ్‌కప్‌నకు ఏడు వారాలే సమయం ఉన్నా.. సెలెక్షన్ కమిటీలోనూ మార్పులు చేపట్టింది. చీఫ్ సెలెక్టర్ కోట్ని బ్రౌనీని తొలగించి అతని స్థానంలో రాబర్ట్ హేన్స్‌ను నియమించింది. సెలెక్షన్ ప్యానెల్‌ను కూడా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. సెలెక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన హేన్స్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. మా విధానాలు, జట్టు ఎంపికపై అతనికి పూర్తి అవగాహన ఉంది. మా అంచనాలకు అనుగుణంగా విండీస్ జట్టును మళ్లీ పురోగమనంలో నిలుపుతాడని భావిస్తున్నాం. తాత్కాలిక కోచ్ రీఫెర్ కూడా ఇదే తరహాలో పని చేస్తాడని నమ్ముతున్నాం. మా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీళ్లిద్దరు దోహదం చేస్తారని ఆశిస్తున్నాం అని సీడబ్యూఐ అధ్యక్షుడు రికీ స్కీరిట్ పేర్కొన్నాడు.

152

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles