ప్రపంచకప్‌లో వెస్టిండీస్


Thu,March 22, 2018 01:25 AM

అర్హత పోటీల్లో స్కాట్లాండ్‌పై గెలుపు
westindies
హరారే: రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్, ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు ఆపసోపాలు పడుతున్న క్రమంలో వరుణుడు గట్టెక్కించాడు. బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 5 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అవగా..లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 125/5తో ఉన్న సమయంలో వర్షం కురియడంతో మ్యాచ్ నిలిచిపోయింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం స్కాట్లాండ్ ఐదు పరుగులు వెనుకబడి ఉండటంతో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మరో బెర్త్ కోసం నేడు జరుగబోయే జింబాబ్వే, యూఏఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉన్నది. ప్రస్తుతం 5 పాయింట్లతో ఉన్న జింబాబ్వే, యూఏఈపై గెలిస్తే 7 పాయింట్లతో ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడితే..మార్చి 23న జరుగబోయే ఆఫ్ఘనిస్థాన్, ఐర్లండ్ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

590

More News

VIRAL NEWS