గ్రామీణ క్రీడాకారులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్


Sat,February 23, 2019 12:49 AM

Srinivas-Goud
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: క్రీడల్లో రాష్ర్టానికి మరిన్ని పేరు, ప్రతిష్ఠలు తీసుకురావాలని క్రీడా,యువజన శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభ కల్గిన క్రీడాకారులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఒలింపిక్ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శుక్రవారం ఎల్బీ స్టేడియానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..మౌళిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు. మంత్రితో పాటు రాష్ట్ర క్రీడ, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సాట్స్ ఎండీ దినకర్‌బాబు, తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.

530

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles