అన్నీ ఉన్నా.. అసలుదేది!


Fri,July 12, 2019 03:08 AM

కోహ్లీ కెప్టెన్సీపై పెరుగుతున్న అసంతృప్తి
విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు దక్కిన ఆణిముత్యం. ఫార్మాట్ ఏదైనా..ప్రత్యర్థి ఎవరైనా..వేదిక ఎక్కడైనా వెన్నుచూపని ధీరత్వంతో పోరాడే క్రికెటర్. దేశ క్రికెట్‌కు దూకుడు నేర్పిన ఆటగాడు. సహచరులు కూడా తనలాగా కసితో ఆడాలని కోరుకునే కెప్టెన్. బ్యాట్స్‌మన్‌గా ఎదురైన రికార్డులను కొల్లగొడుతూ అభినవ మాస్టర్‌గా ప్రశంసలు పొందుతున్న విరాట్.. నాయకుడిగా ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ కెప్టెన్సీలో మెరుపులు మెరిపించలేక పోతున్నాడు. కొన్ని చారిత్రక విజయాలు సాధించినా.. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ప్రభావం చూపించలేకపోతున్నాడు. కోరిందే తడవుగా కోచ్‌ను మార్చినా.. అనుకున్న ఆటగాళ్లను ఎంపిక చేసినా.. అసలు విషయానికి వచ్చేసరికి అనుకున్న ఫలితం రావడం లేదు. ప్రపంచకప్ నిష్క్రమణకు దారి తీసిన కారణాలపై ఓ విశ్లేషణ.
kohli
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: కోట్లాది మంది ఆశలను మోసుకుంటూ బ్రిటిష్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ప్రపంచకప్ పోరును ఘనంగానే ప్రారంభించినా.. కీలకమైన సెమీఫైనల్లో కివీస్ చేతిలో ఓడి నిష్క్రమించింది. టోర్నీలో దక్షిణాఫ్రికాతో మొదలుపెడితే శ్రీలంక వరకు అద్భుత విజయాలతో అందరికంటే టాప్‌లో నిలిచిన కోహ్లీసేన.. కివీస్‌పై పోరాడి ఓడింది. టోర్నీ మొత్తం మీద ఆల్‌రౌండ్ ఆటతీరుతో ఈసారి కప్ కచ్చితంగా కొడుతుందన్న ఆశలు రేపింది. అయితే ఈ మెగాటోర్నీలో టాప్-3 బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ, రాహుల్, కోహ్లీ మినహా మిడిలార్డర్‌లో గొప్పగా రాణించింది ఎవరూ లేరు. ధవన్ గైర్హాజరీలో ఓపెనింగ్‌లో వచ్చిన రాహుల్ తన పాత్రకు న్యాయం చేసినా నాలుగో స్థానంలో యువ రిషబ్ పంత్ అంచనాలు అందుకోలేకపోయాడు. పెద్దన్నలా ధోనీ అంతోఇంతో రాణించినా.. అతనికి సహకరించే వారు కరువయ్యారు.

మిడిల్‌పై నిర్లక్ష్యం

గత కొంత కాలంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ప్రదర్శనతోనే నెట్టుకుంటూ వస్తున్న టీమ్‌ఇండియా మిడిలార్డర్‌పై నిర్లక్ష్యం వ హించింది. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీలో మిడిలార్డర్‌లో నిలకడగా ఆడే ఆటగాడు లేకుండా పోయాడు. నాలుగో నంబర్‌లో లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. కీలకమైన ప్రపంచకప్‌లో ఈ సమస్య కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే టాపార్డర్‌ను కట్టడిచేస్తే పని అయిపోయినట్లేనని ప్రత్యర్థి జట్లకు అర్థమయ్యింది.

కోహ్లీకి ఎదురులేదు

భారత జట్టులో కెప్టెన్ కోహ్లీ మాటకు ఎదురులేదు. తనకు అడ్డు వస్తున్నాడని భావించిన దిగ్గజ అనిల్ కుంబ్లేను కోచ్‌గా తప్పించే దాకా నిద్రపోని కోహ్లీ.. చెప్పినట్లు వినే రవిశాస్త్రిని ఏరికోరి చీఫ్ కోచ్‌గా తెచ్చుకుని మాట నెగ్గించుకున్నాడు. ప్రపంచకప్ సందర్భంగా జట్టు తో పాటు భార్యలను అనుమతించాలని కోహ్లీ అలా కోరాడో లేదో బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఉన్నట్టుండి ఆటగాళ్లను తప్పించడం, అనూహ్యంగా కొందరిని ఎంపిక చేయడం వంటివన్ని కోహ్లీ ఆధిపత్యానికి నిదర్శనమని చెప్పొచ్చు.

విరాట్‌కు పోటీగా రోహిత్

కెప్టెన్ కోహ్లీకి రోహిత్ పోటీనిస్తున్నాడనే చెప్పొచ్చు. ప్రపంచకప్‌ముందు కోహ్లీ విశ్రాం తి తీసుకోగా రోహిత్ కెప్టెన్సీలో నిదహాస్ ట్రోఫీతో పాటు ఆసియా కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు.

* జట్టుకు మద్దతుగా నిలిచేందుకు ఇక్కడికి (ఇంగ్లండ్) అధిక సంఖ్య లో వచ్చిన మా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా అందరికీ ఈ టోర్నీని మంచి జ్ఞాపకంగా మిగిల్చారు. మీరు జట్టుపై కురిపించిన ప్రేమను మేం ఆస్వాదించాం. మేమంతా చాలా నిరుత్సాహపడ్డాం. మీలాగే భావోద్వాగాలను పం మేం చేయగలిగిందంతా చేశాం. జై హింద్.
- కోహ్లీ

465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles