మయాంక్‌.. సెహ్వాగ్‌లా..


Tue,October 8, 2019 02:45 AM

- వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: విశాఖ టెస్టులో ద్విశతకంతో సత్తాచాటిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌పై టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించారు. భయం లేకుండా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌లా మయాంక్‌ ఆడుతున్నాడని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. ‘సాధారణంగా దేశవాళీ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు ఆటగాళ్లు కాస్త మార్పులు చేసుకొని ఆడుతారు. కానీ మయాంక్‌ ఎలాంటి మార్పు లేకుండా ధైర్యంగా ఆడాడు. మానసిక ైస్థెర్యం, స్థిరత్వం అతడి బలాలు. అతడి ఫేవరెట్‌ సెహ్వాగ్‌లాగే మయాంక్‌ ఆడుతున్నాడు’ అని ఓ కార్యక్రమంలో లక్ష్మణ్‌ చెప్పాడు. మయాంక్‌ పాదాల కదలికలు చాలా చక్కగా ఉన్నాయని.. దీనివల్లే అతడు సరైన షాట్లు ఆడుతున్నాడని హర్భజన్‌ అన్నాడు. ‘క్రీజును వదిలి ముందుకు వచ్చి బంతిని బాదినప్పుడు మయాంక్‌ కాళ్లను బాగా ఉపయోగించుకుంటున్నాడు. రివర్స్‌స్వీప్‌ సైతం చక్కగా ఆడుతున్నాడు. అతడిలో చాలా ప్రతిభ దాగుంది. అవసరమైనప్పుడు బయటకు తీస్తున్నాడు. జట్టు కోసం ఏం చేయాలో మయాంక్‌కు బాగా తెలుసు. అందుకే బాగా రాణిస్తున్నాడు’ అని భజ్జీ అన్నాడు.

621

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles