బహిష్కరణకు పుతిన్ నిరాకరణ


Thu,December 7, 2017 03:08 AM

తటస్థ పతాకం కింద పోటీచేస్తామని ప్రకటన
puthin
మాస్కో: వచ్చే ఏడాది జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా అథెట్ల ప్రాతినిధ్యంపై సందిగ్ధతకు తెరపడింది. డోపింగ్‌లో అథ్లెట్లు పట్టుబడిన కారణంగా రష్యాపై అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. డోపింగ్‌లో పాలుపంచుకోని అథ్లెట్లు మాత్రం తటస్థ పతాకం కింద ఆడొచ్చని ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో రష్యా ఆడుతుందా లేదా అన్నదానిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ప్రకటన జారీ చేశారు. బహిష్కరణపై మేము ఎలాంటి ప్రకటన చేయలేదు. మా దేశ అథ్లెట్లను ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోవాలనుకోవడం లేదు. వ్యక్తిగతంగా పోటీపడేందుకు సిద్ధమైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆటోమొబైల్ ప్లాంట్‌లో మాట్లాడిన పుతిన్ అన్నాడు.

420

More News

VIRAL NEWS

Featured Articles