కోహ్లీతో చర్చించాకే..


Tue,October 22, 2019 01:10 AM

Sourav-Ganguly
కోల్‌కతా: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడి ఇష్టమని.. ఈ అంశంపై గురువారం కోహ్లీతో చర్చిస్తానని బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఈనెల 24న బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడుతా. బంగ్లాతో సిరీస్ ఆడుతాడా లేక విరామం తీసుకుంటాడా అనే అంశంపై కూడా చర్చిస్తా అని దాదా పేర్కొన్నాడు. అలాగే టెస్టుల్లో ఇరగదీస్తున్న నయా ఓపెనర్ రోహిత్‌శర్మపై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. వన్డే వరల్డ్‌కప్ నుంచి వరుసపెట్టి మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్న విరాట్ కోహ్లీపై పనిభారం పడకుండా చూసేందుకు అతడికి విశ్రాంతినిచ్చే అవకాశముందని ఇంతకుముందే సెలెక్షన్ కమిటీ అధికారి ఒకరు తెలిపిన విషయం తెలిసిందే.

1805

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles