కోహ్లీ ప్రమేయం లేకుండానే..


Fri,July 19, 2019 02:17 AM

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియాకు నూతన కోచ్ ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమేయం ఏ మాత్రం ఉండబోదని సమాచారం. కోచ్ నియామక ప్రక్రియంతా క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికపై కోహ్లీ అభిప్రాయాలను వారు పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదని బీసీసీఐ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అప్పట్లో అభిప్రాయ భేదాల కారణంగా తన పదవికి కుంబ్లే రాజీనామా చేయగా, ఆ తర్వాత కోచ్ స్థానానికి రవిశాస్త్రి పేరును కోహ్లీనే ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

అనిల్ కుంబ్లేతో తాను లేదా జట్టు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అప్పట్లో(రవిశాస్త్రి నియామకం సమయంలో) కోహ్లీ వెల్లడించాడు. ప్రస్తుత కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై అతడి అభిప్రాయాలను సేకరించరు. ఈసారి కోచ్ ఎంపిక కమిటీలో కపిల్ దేవ్ ఉన్నారు. ఆయన కోహ్లీ సలహాలు వినరు అని బీసీసీఐ అధికారి చెప్పారు. కోచ్ సహా సహాయ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

269

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles