ఫోర్బ్స్ జాబితాలో కోహ్లీ


Wed,June 12, 2019 12:36 AM

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితా ఫోర్బ్స్-2019లో భారత్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే మరోసారి స్థానం దక్కించుకున్నాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించగా, కోహ్లీ 100వ స్థానంలో ఉన్నాడు. ప్రకటనల ద్వారా 21 మిలియన్ డాలర్లు... వేతనం, ప్రోత్సాహకాల ద్వారా 4 మిలియన్ డాలర్లు... మొత్తం 25 మిలియన్ డాలర్ల(రూ.173 కోట్లు)ను కోహ్లీ గత 12 నెలల్లో సంపాదించాడని ఫోర్స్ వెల్లడించింది. గతేడాది 83వ ర్యాంకులో ఉన్న విరాట్ ఈసారి 100కు పడిపోయాడు.

142

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles