మరో రికార్డు ముంగిట కోహ్లీ


Thu,October 11, 2018 01:02 AM

Virat-Kohli
హైదరాబాద్: మంచినీళ్లు తాగినంత సునాయాసంగా టెస్ట్ క్రికెట్‌లో సెంచరీల మోత మోగిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం ఆసియాకప్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఆడిన తొలిమ్యాచ్‌లోనే 139 పరుగులతో సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కోహ్లీ కెరీర్‌లో ఇది 24వ సెంచరీ. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో జరిగే రెండోటెస్టులోనూ కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తే 25 సెంచరీలతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమాముల్ హక్ రికార్డును సమం చేస్తాడు. 15 ఏండ్లపాటు పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇంజమాముల్ హక్ కెరీర్‌లో 120 టెస్టులాడి 25 శతకాలు నమోదు చేశాడు. కాగా, కోహ్లీ 74 టెస్టుల్లోనే 24 సెంచరీలు చేసి అతడిని సమీపించాడు. ఉప్పల్ స్టేడియంలో అద్భుతమైన బ్యాటింగ్ రికార్డు కలిగిన కోహ్లీ మరో సెంచరీతో ఈ రికార్డును అందుకునేలా కనిపిస్తున్నాడు. 51 సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతుండగా.. 24 సెంచరీలతో కోహ్లీ 21వ స్థానంలో కొనసాగుతున్నాడు.

388

More News

VIRAL NEWS

Featured Articles