అద్దింట్లో ముద్దులాట


Tue,March 13, 2018 03:50 AM

virat-anushka.jpg
ముంబై: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అది కూడా నెలకు రూ.15లక్షలు చెల్లిస్తున్నాడు. కోహ్లీ 2016లోనే ముంబైలోని ఒర్లీలో రూ.34కోట్లు పెట్టి ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను ఖరీదు చేశాడు.34వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌ను తనకు నచ్చినరీతిలో తీర్చిదిద్దేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఓంకార్1973ప్రాజెక్ట్స్‌కి అప్పగించాడు. గత ఏడాది డిసెంబర్‌లో పెండ్లి చేసుకున్న ఈ జోడి, ఆ వెంటనే కొత్త ఫ్లాట్‌లోకి దిగాలనుకోగా, బిల్డర్ సకాలంలో పూర్తి చేయలేకపోయాడు. దీంతో ఒర్లీలోనే మరో ప్లాట్‌ను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. కేవలం 24 నెలల కోసమే రహేజా లెజెండ్స్ అపార్ట్‌మెంట్ 40వ అంతస్తులో ఓ ఫ్లాట్ తీసుకున్నారు. నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు. దీనికోసం రూ.కోటిన్నర డిపాజిట్, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.01కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఏదేమైనా బిజీ షెడ్యూల్ నుంచి విరామం దొరికేసరికి అనుష్క కోహ్లీపై తన ప్రేమను తెలుపుతూ ముద్దు పెట్టిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.ఇది వైరల్ గా మారింది.

1622

More News

VIRAL NEWS