ప్రపంచ స్నూకర్‌లో విద్యకు రజతం

Tue,March 21, 2017 12:50 AM

SNOOKERసింగపూర్: భారత మహిళల స్నూకర్ స్టార్ విద్యా పిైళ్లె మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. తమిళనాడుకు చెందిన ఈ స్టార్ క్రీడాకారిణి ప్రపంచ మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పతకంతో మెరిసింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ దాకా చేరిన విద్య టైటిల్‌పోరులో మాత్రం తడబాటుకు గురై స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. తుది సమరంలో మాజీ ప్రపంచ చాంపియన్, హాంకాంగ్ నంబర్‌వన్ ఎంగ్ ఓన్ యూ చేతిలో విద్య 4-5 స్కోరు తేడాతో పరాజయంపాలై రజతపతకంతో సంతృప్తిపడింది. తొలుత 4-2తో ఆధిక్యంలోకెళ్లిన విద్య.. ఆ తర్వాత ప్రత్యర్థికి వరుసగా మూడు ఫ్రేములను కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 39ఏండ్ల విద్యకిది నాలుగో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం కావడం విశేషం.

621

More News

మరిన్ని వార్తలు...