అక్క చేతిలో సెరెనా ఓటమి


Wed,March 14, 2018 12:45 AM

serena.jpg
ఇండియానా వెల్స్: 15 నెలల విరామం తర్వాత పునరాగమనం చేసిన అమెరికా టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్..తన అక్క వీనస్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇండియానా వెల్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌం డ్‌లో సెరెనా 3-6, 4-6తో వీనస్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ అక్కాచెల్లెల్లు ఒక టోర్నీలో తొలి రౌండ్‌లోనే తలపడటం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా 29 సార్లు తలపడగా సెరెనా 17, వీనస్ 12 విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్‌లో స్విస్ దిగ్గజం టాప్ సీడ్ రోజర్ ఫెదరర్ 6-2, 6-1తో ఫిలిప్ క్రజనోవిక్‌పై సునాయాసంగా గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles