వరల్డ్, ఆసియా చెస్ పోటీలకు సరయు


Mon,May 13, 2019 02:50 AM

sarayu
వరంగల్ స్పోర్ట్స్: విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి అండర్-13 చెస్ పోటీల్లో వరంగల్ చెస్ క్రీడాకారిణి వేల్పుల సరయు విజేతగా నిలిచింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సరయు మొత్తం 11 రౌండ్లలో పోటీపడగా, 9 రౌండ్లలో విజయాలను సొంతం చేసుకుని అగ్రస్థానం దక్కించుకుంది. తద్వారా ప్రపంచ, ఆసియా చెస్ టోర్నీలకు ఎంపికై తన సత్తాచాటింది.దీనికి తోడు ఇటీవల రాయ్‌పూర్‌లో పాఠశాలల జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న సరయు రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ, ఆసియా టోర్నీలకు ఎంపికైన సరయును జిల్లా చెస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి టీడీ టామీ, కన్న, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

162

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles