మిథాలీ X కౌర్


Sat,May 11, 2019 05:10 AM

-వెలాసిటీ, సూపర్‌నోవాస్ మధ్య నేడు ఫైనల్
-మహిళల టీ20 చాలెంజ్

జైపూర్: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ, హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగే తుది పోరులో ఈ రెండు జట్లు కప్ కోసం కదనరంగంలోకి దిగనున్నాయి. మహిళల టీ20 క్రికెట్‌కు మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో తొలిసారి ఐపీఎల్‌తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో అమ్మాయిలు అదరగొడుతున్నారు. తాము ఎందులో తీసిపోమంటూ అభిమానులకు పొట్టి ఫార్మాట్ మజాను అందిస్తున్నారు. కండ్లుచెదిరే సిక్స్‌లకు తోడు మెరుపు ఫీల్డింగ్‌తో మైమరిపిస్తున్నారు. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన టోర్నీలో విజేత ఎవరో శనివారం తేలనుంది.
Mithaliraj

హైదరాబాదీ మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ జట్టులో యంగ్ తరంగ్ షెఫాలీ వర్మ, వేదా కృష్ణమూర్తి, డానియెల్లీ వ్యాట్, అమిలీయా కెర్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టాపార్డర్‌లో హయెలీ మాథ్యూస్, షెఫాలీ వర్మ శుభారంభమందిస్తే..మిడిల్‌లో మిథాలీ, వ్యాట్ జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరు మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు బాగా కలిసిరానుంది. బౌలింగ్ విషయానికొస్తే..శిఖాపాండే, ఏక్తాబిస్త్, కోమల్ జంజద్, దేవికా వైద్యతో పటిష్ఠంగా కనిపిస్తున్నది.
కౌర్‌సేన జోరు: ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండు పాయింట్లతో కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ టాప్‌లో నిలిచింది. ట్రయల్ బ్లేజర్స్‌తో తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన కౌర్‌సేన..వెలాసిటీతో మరో మ్యాచ్‌లో సత్తాచాటింది. యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్ మీదుండటం కౌర్‌సేనకు సానుకూలాంశం. ఎదురుపడ్డ బౌలర్‌నల్లా చితుకబాదుతూ రోడ్రిగ్స్ టోర్నీలో మెరుపులు మెరిపిస్తున్నది. ఇదే జోరు ఫైనల్లో కొనసాగిస్తే..సూపర్ నోవాస్‌కు తిరుగుండకపోవచ్చు. రోడ్రిగ్స్‌కు తోడు సోఫీ డివైన్, హర్మన్‌ప్రీత్‌కౌర్, స్కీవర్ చెలరేగితే మిథాలీసేనకు ముప్పు ముంచుకొచ్చినట్లే. అనూజ పాటిల్, పూన మ్ యాదవ్, రాధా యాదవ్, స్కీవర్‌తో నోవాస్ బౌలింగ్ దళం దుర్బేద్యంగా కనిపిస్తున్నది. వీరు తలో చేయి వేస్తే కప్ కౌర్‌సేన సొంతమైనట్లే.

218

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles