బొటాస్‌దే జపాన్ గ్రాండ్‌ప్రి


Mon,October 14, 2019 01:26 AM

ValtteriBottas
సుజుక (జపాన్): ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సెడెస్ రేసర్ వాల్తెరి బొటాస్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన రేసులో ఫెరారీ రేసర్ సెబాస్టియన్ వెటెల్‌ను, తన జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్‌ను వెనక్కి నెట్టి బొటాస్ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో డబుల్ పోడియం ఫినిష్‌తో మెర్సెడెస్ వరుసగా ఆరో ఏడాది కన్‌స్ట్రక్టర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే రేసులో ఫెరారీకి చెందిన మరో డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ ఆరోస్థానంలో నిలిచి నిరాశపరిచాడు. ఇక నాలుగో స్థానంలో రెడ్‌బుల్ రేసర్ అల్బొన్ నిలువగా, ఆదే జట్టుకు చెందిన స్టార్ వెర్‌స్టాపెన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. ఓ దశలో మూడో స్థానంలో ఉన్న బొటాస్ చివరికి మెరుపువేగంతో టాప్‌లో నిలిచి టైటిల్‌ను ముద్దాడాడు.

128

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles