ఆఖరాట ఆడేశాడు


Sun,August 13, 2017 12:41 AM

bolt
లండన్: జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఫైనల్ కౌంట్‌డౌన్ అయిపోయింది. కెరీర్‌లో ఇదే తనకు చివరి ఈవెంట్ అని ప్రకటించిన బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆఖరి రేసు ఆడేశాడు. మీరు పొద్దున లేచి చూసేసరికి బోల్ట్ పోటీపడిన 4.100 మీటర్ల రేసు ఫలితం కూడా వచ్చేసుంటుంది. ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే తానాడిన 100 మీటర్ల వ్యక్తిగత రేసులో స్వర్ణం చేజార్చుకొని కాంస్యానికి పరిమితమైన బోల్ట్.. రిలే ఈవెంట్‌లో మాత్రం నిరాశపరుచను అని రేసుకు ముందురోజు చెప్పాడు. అనుకున్నట్లుగానే, బోల్ట్ సారథ్యంలోని జమైకా జట్టు పురుషుల 4X100 మీటర్ల రిలేలో హీట్స్‌ను విజయవంతంగా అధిగమించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో హీట్స్ నుంచి పోటీపడ్డ టైక్వాండో ట్రేసీ, జులియన్ ఫోర్టె, మైకేల్ క్యాంప్‌బెల్, బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం 37.95 సెకన్లలో రేసు ముగించి ఈ సీజన్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసింది.

బోల్ట్ జట్టుకు గట్టి పోటీదారుగా భావించిన జస్టిన్ గాట్లిన్, మైక్ రోడ్జెర్స్, బీ జే లీ, క్రిస్టియన్ కోల్‌మన్‌లతో కూడిన అమెరికా బృందం రికార్డు టైమింగ్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమెరికా జట్టు ఈ సీజన్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదుచేస్తూ 37.70 సెకన్లలో రేసును ముగించి తన హీట్స్‌లో టాప్‌లో నిలిచింది. బ్రిటన్ జట్టు 37.76 సెకన్లతో రెండో అత్యుత్తమ టైమింగ్ ప్రదర్శన చేయగా, బోల్ట్ బృందం మూడో అత్యుత్తమ టైమింగ్, ఫ్రాన్స్ బృందం (38.03 సెకన్లు) నాలుగో అత్యుత్తమ టైమింగ్‌తో ఫైనల్ చేరాయి.
భారత రిలే జట్లకు నిరాశ:భారత్‌కు చెందిన పురుషులు, మహిళల రిలే జట్లు 4X400 మీటర్లలో ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

షిప్పర్స్‌దే 200 మీటర్ల కిరీటం


Dafne-Schippers
మహిళల 200 మీటర్ల రేసులో నెదర్లాండ్స్ స్టార్ అథ్లెట్ డాఫ్నె షిప్పర్స్ టైటిల్ నిలబెట్టుకుంది. 25ఏండ్ల షిప్పర్స్ ఫైనల్ రేసును 22.05 సెకన్లలో ముగించి మొదటిస్థానంలో నిలిచి వరుసగా రెండోసారి స్వర్ణం ఎగురేసుకుపోయింది. షిప్పర్స్ కంటే సెకనులో 300వంతు తేడాతో వెనుకబడిన ఐవరీకోస్ట్ అమ్మాయి మేరీ జోస్ రజతంతో సరిపెట్టుకుంది. బహమాస్‌కు చెందిన షానె మిల్లర్ కాంస్యం అందుకుంది.

313

More News

VIRAL NEWS

Featured Articles