జైపూర్‌కు యూపీ షాక్


Tue,August 20, 2019 01:34 AM

PKL

-ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న జైపూర్ పింక్ పాంథర్స్‌కు యూపీ యోధా షాకిచ్చింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో యూపీ 31-24తో జైపూర్‌ను ఓడించింది. లీగ్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన జైపూర్‌కు ఇది రెండో పరాజయం కాగా.. 9 మ్యాచ్‌లాడిన యూపీకి మూడో విజయం. యోధా తరఫున సురేందర్ గిల్ (8 పాయింట్లు), శ్రీకాంత్ జాదవ్ (7 పాయింట్లు) రాణించారు. పాంథర్స్ తరఫున దీపక్ హుడా (9 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడటంతో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. అయితే తొలి అర్ధభాగం ముగియడానికి కాస్త ముందు జైపూర్ ఆలౌటవడంతో యూపీ 16-10తో ఫస్ట్ హాఫ్ ముగించింది. రెండో సగంలోనూ అదే ఆధిక్యం కొనసాగించిన యోధా అలవోకగా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 30-27తో యు ముంబాపై విజయం సాధించింది. లీగ్‌లో నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పోటీల్లో పుణెరీతో బెంగళూరు, జైపూర్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.

351

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles